YS Sharmila: వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలు ఈ నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈనెల 18న నిశ్చితార్థ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల వివాహం జరగనుంది. రాజారెడ్డి ప్రియా అట్లూరిని ప్రేమించి పెళ్లి చేసుకోనున్నారు. ఈ వేడుకలకు సంబంధించి ఆహ్వాన పత్రికను ఇడుపులపాయలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ కు సోదరి షర్మిల ఆహ్వాన పత్రిక అందించారు. వివాహ వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
అయితే షర్మిల కోడలు ప్రియా అట్లూరి ఎవరు అని ఎక్కువమంది ఆరా తీస్తున్నారు. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె బంధువులు ఎవరు? అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చ నడుస్తోంది. అట్లూరి ప్రియ చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలని ప్రచారం జరిగింది. దీంతో చట్నీ సంస్థ యాజమాన్యం ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. ప్రియతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో.. చంద్రబాబు బంధువు అని కూడా టాక్ నడిచింది. జగన్ ప్రత్యర్థి చంద్రబాబు, ఆపై వ్యతిరేక సామాజిక వర్గంగా ఉన్న కమ్మ కులం పిల్లను షర్మిల కోడలుగా తెచ్చుకుంటున్నారని నేటిజెన్లు రకరకాల కామెంట్స్ చేశారు.
అయితే తాజాగా మరో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియ బ్రదర్ అనిల్ కుమార్ స్నేహితుడైన శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తెగా తేలింది. అమెరికాలో స్థిరపడిన అట్లూరి శ్రీనివాస్ అక్కడ బ్రదర్ అనిల్ కుమార్ కు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ కుటుంబాల మధ్య రాకపోకలు ఉండడంతో రాజారెడ్డి- ప్రియ మధ్య ప్రేమ చిగురించిందని.. అదే పెళ్లి వరకు దారి తీసిందని తెలుస్తోంది. మొత్తానికి అయితే షర్మిల కుమారుడి పెళ్లి విషయం, చేసుకోబోయే పిల్ల విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చింది.