Homeజాతీయ వార్తలుఎవరీ సుకేశ్‌ చంద్రశేఖర్‌?: బీఆర్ఎస్‌తో ఏంటీ సంబంధం?

ఎవరీ సుకేశ్‌ చంద్రశేఖర్‌?: బీఆర్ఎస్‌తో ఏంటీ సంబంధం?

Sukesh Chandrasekhar – BRS : మద్యం కుంభకోణం కేసులో.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు ‘సౌత్‌ గ్రూప్‌’ ముడుపులు ఇచ్చిందనేది దర్యాప్తు సంస్థల ప్రధాన ఆరోపణ! కానీ దానికి భిన్నంగా.. 2020లో కేజ్రీవాలే తన ద్వారా హైదరాబాద్‌లోని టీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయానికి రూ.15 కోట్లు చేరవేశారంటూ.. మనీలాండరింగ్‌ కేసులో జైల్లో ఉన్న మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ సంచలన ఆరోపణలు చేశాడు. ఈనేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా సుకేశ్‌ చంద్రశేఖర్‌ గురించే చర్చ జరుగుతోంది. ఏకంగా అతడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ టాపిక్‌గా నిలిచాడు. అసలు ఎవరు ఈ సుకేశ్‌ చంద్ర శేఖర్‌? ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రికే దమ్కి ఇచ్చేంత రేంజా ఇతడిది అని ఆరా తీస్తే.. మైండ్‌ బ్లాంక్‌ అయ్యే విషయాలు తెలిశాయి.

రబ్బరు కాంట్రాక్టరు కుమారుడు

సుకేశ్‌ చంద్రశేఖర్‌.. బెంగళూరులోని భవానీనగర్‌కు చెందిన ఓ రబ్బరు కాంట్రాక్టరు కుమారుడు. కేవలం పదిహేడేళ్ల వయసులో నేరజీవితాన్ని మొదలుపెట్టి.. ప్రముఖ పారిశ్రామికవేత్తలను, సినీతారలను మోసం చేసి, బెదిరించి, మభ్యపెట్టి కోట్లాది రూ పాయలు సాధించిన మోసగాడు! ప్రముఖుల కుమారుడిననో.. సెక్రటరీననో.. పరిచయం చేసుకుని, ప్రభుత్వ కాంట్రాక్టులు, బెయిళ్లు ఇప్పిస్తానంటూ దోచుకోవడం ఇతడి తీరు. ఇదే క్రమంలో.. జయలలిత చనిపోయాక, అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకులను ఇప్పిస్తానంటూ టీటీవీ దినకరన్‌తో రూ.50 కోట్లకు డీల్‌ కుదుర్చుకుని అడ్డంగా పోలీసులకు దొరికిపోయి తిహార్‌ జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. అక్కడ కూడా ఖాళీగా కూర్చోలేదు.. 2020, 2021సంవత్సరాల్లో.. జైల్లో నుంచే ఫోన్లు, గొంతు మార్చే పరికరాల సాయంతో.. ర్యాన్‌బాక్సీ యజమాని శివీందర్‌ సింగ్‌ భార్యకు ఫోన్‌ చేసి ఆయనకు బెయిల్‌ ఇప్పిస్తానంటూ రూ.200 కోట్లు దోచుకున్నాడు.

బీఆర్ఎస్ కు రూ.15 కోట్లు

ఆర్థిక నేరగాడైన సుఖేశ్‌ చంద్రశేఖర్‌.. గతంలో ఆప్‌ తరఫున 15 కోట్లను బీఆర్ఎస్‌ నేతలకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఇతడు హైదరాబాద్‌ వచ్చినప్పుడు నగరానికి చెందిన ఓ బీఆర్ఎస్‌ నాయకుడి ఇంట్లో దిగేవాడని తెలుస్తోంది. తర్వాత నోవాటెల్‌ వెళ్లి ‘ఆడ’ నటీమణులతో చిల్‌ అయ్యేవాడని సమాచారం. ప్రస్తుతం సుఖేశ్‌ లేఖతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అంతే కాదు సదరు బీఆర్ఎస్‌ నాయకుడు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నోరా ఫతేహితో సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌

ఇలా సంపాదించిన సొమ్ముతో.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నోరా ఫతేహి వంటి సినీతారలకు వల వేసి, వారికి ఖరీదైన కానుకలిచ్చి బుట్టలో వేసుకున్నాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు. ఇటీవల అతడి సెల్‌లో అధికారులు తనిఖీలు చేసి.. రూ.15 లక్షల విలువ చేసే చెప్పులు, రూ.80 వేల విలువ చేసే ప్యాంట్లు స్వాధీనం చేసుకున్నారు. జైల్లోంచే బెదిరింపు రాకెట్‌ నడపడానికి వీలు కల్పించినందుకు.. తిహార్‌ జైలు అధికారులకు నెలకు కోటి రూపాయల దాకా లంచంగా ఇచ్చేవాడని సమాచారం. ఈడీ ఉచ్చుకు చిక్కి 2017 నుంచి తిహార్‌ జైల్లో ఉన్న సుకేశ్‌ను కలవడానికి కనీసం 12 మంది దాకా మోడళ్లు, నటీమణులు వచ్చారని సమాచారం.

ఎప్పుడంటే అప్పుడు

జైలు అధికారులకు భారీగా లంచాలు ఇవ్వడం వల్ల.. సుకేశ్‌ను కలవడానికి అతడి భార్య లీనా మారియా పాల్‌ (తమిళ సినీ నటి) ఎప్పుడంటే అప్పుడు ఎలాంటి అ డ్డంకులూ లేకుండా వెళ్లేందుకు వారు అనుమతిచ్చేవారట. జైల్లో సుకేశ్‌ ‘ఆఫీసు’.. టీవీ, ఫ్రిజ్‌, సోఫా వంటివాటితో అత్యంత విలాసవంతంగా ఉండేదని మారియాపాల్‌ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. జైల్లో అతడిచ్చే ‘చికెన్‌ పార్టీ’లకు ‘ఆడ’ అతిథులను పెద్ద ఎత్తున ఆహ్వానించేవారని.. వాటికి పలువురు మోడళ్లు, నటీమణులు వచ్చేవారని.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నోరా ఫతేహి (‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటలో నర్తించింది) కూడా ఇలా అతడు ఇచ్చిన పార్టీలకు వచ్చారని అధికారులు చెబుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular