Rajya Sabha-Telangana: దేశంలో రాజ్యసభ ఎన్నికల కోలాహలం మొదలైంది. పెద్దల సభ కోసం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో పార్టీలు తమ అభ్యర్థులను నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీకి 25 మంది సభ్యులు అవసరం కాగా ఇప్పటికి 16 మంది అభ్యర్థులు ఖరారు అయిపోయారు. ఇంకా ఏడుగురు అభ్యర్థులపై పార్టీ అధిష్టానం మళ్లగుల్లాలు పడుతోంది. సరైన అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి విధేయులుగా ఉన్న వారిని ఎంచుకుని వారిని తమ వైపు ఉంచుకునేందుకు టికెట్లు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
Rajya Sabha
కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్ పోటీకి దిగనున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యాలను గుర్తిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో సమర్థులైన వారికే పట్టం కట్టాలని భావిస్తోంది. దీని కోసమే అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికలు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు పరీక్షగా మారుతున్నాయి.
Also Read: RRR Creating Records In OTT: OTT లో కూడా ప్రభంజనం సృష్టించిన #RRR.. ఎంత వసూలు చేసిందో తెలుసా..?
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్క నాయకుడు జీవీఎల్ నరసింహారావు పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో తెలంగాణలో ఒకరికి రాజ్యసభ పదవి వస్తుందనే ఆశతో ఉన్నారు. దీంతో అది ఎవరిని వరిస్తుందో కూడా తెలియడం లేదు. మొత్తానికి బీజేపీ నేతల్లో ఆశలు మాత్రం పెరుగుతున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం ఏం ఆలోచిస్తుందో కూడా తెలియడం లేదు. దీంతో అందరిలో తమకు పదవి వస్తుందనే చిన్న ఆశ ఎక్కడో పుడుతోంది. అధిష్టానం మాత్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావడం లేదు. రాబోయే రోజుల్లో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇంకా సమయం ఉండటంతో అభ్యర్థుల కోసం తర్జనభర్జన అనంతరం పేర్లు ప్రకటించే అవకాశముంది.
Rajya Sabha
తెలంగాణ నుంచి ఒకరికి ప్రాతినిధ్యం దక్కతుందనే వార్తలతో నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. తమకు పదవి దక్కుతుందో లేదో అనే అనుమానం నేతల్లో వస్తోంది. పార్టీని నమ్ముకున్న మాకు కాకుండా ఇంకా ఎవరికి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానం కోసం ఎవరో ఒకరికి మాత్రం కచ్చితంగా చోటు దక్కుతుందనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో రాజ్యసభ అభ్యర్థి విషయంలో కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఎవరికి ఆ వరం దక్కనుందో వేచి చూడాల్సిందే మరి.
Also Read:RRR Making Video: ‘ఆర్ఆర్ఆర్’లోని బ్రిడ్జి సీన్ అద్భుతహా.. ఎలా చేశారో చూడండి