Maharashtra Crisis: మహారాష్ట్ర సీఎం కుర్చీ: ఉద్ధవ్.. ఆ రోజు బీజేపీని అడిగింది ఇదే కదా!

Maharashtra Crisis: సీఎం కుర్చీ.. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ సీట్.. అందరి లక్ష్యం అదే. అది దక్కుతుందంటే నేతలు ఎంతైనా చేయడానికి తెగిస్తారు. తెలంగాణ వస్తే ‘దళితుడే మొదటి ముఖ్యమంత్రి’ అన్న కేసీఆర్ తీరా ఎన్నికల్లో గెలిచాక ఆ సీఎం సీటుపై కూర్చొని ఇప్పటికీ 8 ఏళ్లుగా లేవడం లేదు. ఆంధ్రాలో నాన్న వైఎస్ఆర్ చనిపోగానే ఆ సీఎం సీటు కోసం సంతకాలు సేకరించి.. కుదరకపోవడంతో ఎదిరించి.. జైలు పాలయ్యి.. పాదయాత్ర చేసి చివరకు అష్టకష్టాలు […]

Written By: NARESH, Updated On : June 30, 2022 8:03 pm
Follow us on

Maharashtra Crisis: సీఎం కుర్చీ.. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ సీట్.. అందరి లక్ష్యం అదే. అది దక్కుతుందంటే నేతలు ఎంతైనా చేయడానికి తెగిస్తారు. తెలంగాణ వస్తే ‘దళితుడే మొదటి ముఖ్యమంత్రి’ అన్న కేసీఆర్ తీరా ఎన్నికల్లో గెలిచాక ఆ సీఎం సీటుపై కూర్చొని ఇప్పటికీ 8 ఏళ్లుగా లేవడం లేదు. ఆంధ్రాలో నాన్న వైఎస్ఆర్ చనిపోగానే ఆ సీఎం సీటు కోసం సంతకాలు సేకరించి.. కుదరకపోవడంతో ఎదిరించి.. జైలు పాలయ్యి.. పాదయాత్ర చేసి చివరకు అష్టకష్టాలు పడి ముఖ్యమంత్రి సీటును అధిరోహించాడు జగన్. అంతటి పవర్ ఫుల్ సీటును వదులుకోవడానికి ఏ నేత ఇష్టపడడు. ఎలాగైనా సరే ‘సీఎం’ అయిపోవడానికి పరితపిస్తుంటారు.

ఈ రాజకీయ క్రీడల్లోనే మహారాష్ట్ర సీఎం సీటు మారిపోయింది. ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని గెలిచాక బీజేపీని మోసం చేసి కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి దొడ్డిదారిన సీఎం అయిపోయాడు శివసేన అధినేత ‘ఉద్దవ్ ఠాక్రే’. తన భార్య చిరకాల కోరికను నెరవేర్చాడు. అయితే ఉద్దవ్ చేసింది మోసం.. అనైతికం.. బీజేపీకి ద్రోహం. అయినా సీఎం సీటు కోసం శివసేన సిద్ధాంతాలకు కాలం చేసి.. సెక్యూలర్ పార్టీలతో ఉద్దవ్ కలిసిపోయారు. ఇదే శివసైనికులు కడుపు మండేలా చేసింది. చివరకు ఆ అగ్ని మూడేళ్లకు అంటుకొని ఉద్దవ్ సీఎం సీటును కోల్పోయేలా చేసింది.

తమను మోసం చేసిన శివసేన అధిపతి ఉద్దవ్ ఠాక్రేను అదునుచూసి దెబ్బకొట్టింది బీజేపీ. శివసేనలో అసంతృప్తిపై పెట్రోల్ పోసి రెచ్చగొట్టేలా చేసింది. ఏక్ నాథ్ షిండేకు అన్ని రకాలుగా అండదండలు అందించి బీజేపీలో పాలనలో ఉన్న అస్సాంకు తరలించి ఆయనను కంటికి రెప్పలా కాపాడింది.

ఇక తమ ప్రభుత్వం కూలిపోవడానికి బీజేపీనే కారణమని శివసేన అధినేత ఉద్దవ్ ఆడిపోసుకున్నారు.దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతానని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ డిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ సహా ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్కార్ లను కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే పనిచేస్తే దేశంలో బీజేపీపై ద్వేషభావం కలగడం ఖాయం.

పైగా మహారాష్ట్రలో అధికారానికి ఇంకా రెండేళ్లు సమయం మాత్రమే ఉంది. మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత తమపై పడకూడదనే భావనతోనే తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండేనే సీఎంను చేసి తమ చేతులకు మట్టి అంటకుండా బీజేపీ జాగ్రత్త పడింది.

ఈ సీఎం సీటు తనకే కావాలని నాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఉద్దవ్ ఠాక్రే అడిగారు.కానీ 60 సీట్లు మాత్రమే వచ్చిన శివసేనకు.. 106 సీట్లు వచ్చిన బీజేపీ ఇవ్వను పో అన్నది. కానీ ఇప్పుడు 40 మంది ఎమ్మెల్యేలే బలం ఉన్నా కూడా ఏక్ నాథ్ షిండేకు బీజేపీ సపోర్ట్ చేస్తోంది. నాడే ఉద్దవ్ కు సీఎం సీటును ఇచ్చి ఉన్నా.. సగం సగం అధికారం పంచుకున్నా ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు.. నాడు సీఎం సీటును శివసేనకు ఇవ్వలేకపోయిన బీజేపీ.. ఇప్పుడు అదే శివసేన రెబల్స్ కు అధికారం అప్పగించేస్తోంది. కానీ తమతో పెట్టుకుంటే అధికారంలో ఉండరని మాత్రం సంకేతాలు ఇస్తోంది. తమను ఎదురిస్తే ఇదే గతి పడుతుందని హెచ్చరికలు పంపుతోంది.