బాబు సొంత రాష్ట్రానికి వెళ్లేదెప్పుడు?

ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు ఇన్ని రోజులు పక్కరాష్ట్రంలో ఉంటాడని కలలుగన్నామా? అదీ ఆంధ్రప్రదేశ్ కు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి సొంత రాష్ట్రంలో లేకుండా పోవడమా? కానీ ఎంతో మంది పీఠాలు కదిలించిన ఆయన పీఠాన్ని నిజంగానే కదిలించేసింది కరోనా.. అవును.. కరోనా వైరస్ దెబ్బకు అడ్రస్ లేకుండా పోయారు ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు. ఏంటీ వైపరీత్యం అని రాజకీయాల్లో కథలు కథలుగా చెబుతున్నారు.. *చంద్రబాబు పరిస్థితి ఎందుకిలా తయారైంది? ఏపీ […]

Written By: admin, Updated On : May 10, 2020 7:17 pm
Follow us on

ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు ఇన్ని రోజులు పక్కరాష్ట్రంలో ఉంటాడని కలలుగన్నామా? అదీ ఆంధ్రప్రదేశ్ కు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి సొంత రాష్ట్రంలో లేకుండా పోవడమా? కానీ ఎంతో మంది పీఠాలు కదిలించిన ఆయన పీఠాన్ని నిజంగానే కదిలించేసింది కరోనా.. అవును.. కరోనా వైరస్ దెబ్బకు అడ్రస్ లేకుండా పోయారు ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు. ఏంటీ వైపరీత్యం అని రాజకీయాల్లో కథలు కథలుగా చెబుతున్నారు..

*చంద్రబాబు పరిస్థితి ఎందుకిలా తయారైంది?

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అంతటి సీనియర్లు ఒకరో ఇద్దరు ఉన్నారు. వారిలో మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు గారు ఒకరు. 14 ఏళ్లు ఏపీని పాలించి అంతకంటే ఎక్కువ ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఏపీకి ఉన్న పెద్ద మనిషిని ఇప్పుడు కరోనా కంట్రోల్ చేసింది. పక్కరాష్ట్రంలోనే ఉండిపోయేలా చేసింది. బాబు ప్రభను కరోనా సగం తగ్గించేస్తే.. జగన్, మోడీ మరింతగా తగ్గించేస్తున్నారు.

*విశాఖ ఉపద్రవానికి వెళ్లనీయని దైన్యం..
దేశమంతా లాక్ డౌన్ ఉంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాల అనుమతి కావాలి. ఇదే ప్రతిపక్ష చంద్రబాబుకు శరాఘాతంగా మారింది. విశాఖలో గ్యాస్ లీక్ అయ్యి 12 మంది చనిపోతే కూడా పరామర్శించలేని దైన్యం చంద్రబాబుకు ఎదురైంది. విమానంలో వెళ్లడానికి కేంద్ర హోంశాఖ అనుమతి కోరినా చంద్రబాబుకు పర్మిషన్ రాలేదు. ఇక ఏపీ ప్రభుత్వ వర్గాలు ఆయన రావడానికి అనుమతివ్వలేదు. దీంతో తెలంగాణలో చిక్కుబడిపోయిన బాబు గారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

*ఓటమితో చంద్రబాబు మనస్థాపంలో ఉన్నారా?
ఏపీని విడిచి ప్రజలకు దూరంగా చంద్రబాబు ఇన్ని రోజులు ఎప్పుడూ లేడని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. చంద్రబాబు ఏపీని వదిలి తెలంగాణకు పోవడానికి గత ఎన్నికల్లో ఓటమి మనస్తాపం కలిగించిందంటున్నారు. అప్పటి నుంచే తనను ఓడించిన ప్రజలకు కాస్త దూరం జరిగాడనే అభిప్రాయం ఉంది. కరోనా టైంలో అందుకే హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ నెలన్నర రోజులు ఏపీ పాలిటిక్స్ లో బాబు వేలిపెట్టింది లేదు. ఇలా ప్రధాన రాజకీయ ప్రతిపక్ష నేత ఇన్ని రోజులు దూరంగా ఉండడం అరుదు అనే చెప్పాలి. దీనంతటికి ఏపీలో జగన్ ధీటైన పాలన.. భవిష్యత్ పై నీలినీడలు.. ఓటమి నైరాశ్యం కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. కానీ పడిలేచిన కెరటం లాంటి చంద్రబాబు ఖచ్చితంగా కోలుకుంటాడనే నమ్మకం టీడీపీ శ్రేణుల్లో ఉంది.

*కరోనా టైంలో పక్కరాష్ట్రంలోకి బాబు.. అదే పొరపాటా?
కరోనా వైరస్ ప్రబలి లాక్ డౌన్ విధించిన వేళ చంద్రబాబు హైదరాబాద్ లోని తన సొంత ఇంటికి వెళ్లడమే ఇప్పుడు పెద్ద పొరపాటు అయ్యింది. ఏపీలోనే ఉండిపోయి ఉంటే ఇప్పుడు అక్కడి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే వారు. కానీ ఎవరి సొంతింట్లో వాళ్లు ఉండండని ప్రభుత్వం అనడం.. ఇన్ని రోజులు లాక్ డౌన్ ఉంటుందని చంద్రబాబు ఊహించక.. పైగా తన లాంటి దిగ్గజ రాజకీయ నేత ఎక్కడికైనా వెళ్లొచ్చన్న ధీమాతో తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లిన బాబు అక్కడే బంధీ అయిపోయాడు. ఇప్పుడు ఏపీలో ఏం జరిగినా కనీసం పోయే పరిస్థితి లేకుండా పోయింది. అక్కడ మోడీ బ్రేకులేస్తే.. ఇక్కడ జగన్ అడ్డుకుంటున్నారు. దీంతో చంద్రబాబు కేవలం ట్విట్టర్ పలుకులకు.. సోషల్ మీడియాలో వ్యాఖ్యలకే పరిమితం అవుతున్నాడు. అప్పుడప్పుడూ వీడియో సందేశాలిస్తున్నారు. పక్కరాష్ట్రంలో చిక్కుకుపోయిన చంద్రబాబు ఇలా అవుతుందని ఊహించలేదు. మరి బాబుకు ఎన్నాళ్లీ హోం క్వారంటైన్ అని ఏపీ తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.. బాబు రావా అంటూ ఎదురుచూస్తున్నారు.. లాక్ డౌన్ ముగిసేదెప్పుడు.. బాబు వచ్చేదప్పుడూ.. కనీసం చినబాబు లోకేష్ బాబు దర్శనం అయినా కలిగితే బాగుండని ఎదురుచూస్తున్నారు.

-నరేశ్ ఎన్నం