Maha Kumbh Mela : మహా కుంభమేళకు సమయం ఆసన్నమైంది. ఉత్తరప్రదేశ్ ఈ మేళకు సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఎప్పుడెప్పుడా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కూడా. ఇప్పటికే ఫుల్ గా టికెట్స్ బుక్ చేసుకొని రెడీగా ఉన్నారు భక్తులు. ఈ కుంభమేళా చూడటానికి కేవలం ఇండియాలోని ప్రజలు మాత్రమే కాదు విదేశీయులు కూడా వస్తారు. అందుకే ఇక్కడ ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటారు అధికారులు. ఇక ఈ ఈ కుంభమేళాలోని సంస్థలు, కల్పవాసులకు అతి తక్కువ ధరకే ఆహార ధాన్యాలను అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తుంది యోగి ప్రభుత్వం. అందులో భాగంగా మరో గొప్ప విషయానికి శ్రీకారం చుట్టింది.
పెద్ద ఎత్తున నిర్వహించే కుంభమేళాలో ఎవ్వరూ ఆకలితో అలమటించకుండా ఉండేలా కూడా ప్లాన్ చేసింది. అందుకే అతి తక్కువ ధరకు ఆహార ధాన్యాలు ఇవ్వనున్నారు. సీఎం యోగి ఆదేశాల మేరకు కుంభమేళాలో కేవలం 5 రూపాయలకే గోధుమపిండి, 6 రూపాయలకే బియ్యం ఇస్తామని ప్రకటించారు. దీనికోసం మేళాలో 138 రేషన్ షాపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కుంభమేళాను సరికొత్తగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ .
అధికారులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా భక్తుల భోజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు కూడా. మేళా ప్రాంతంలో 138 రేషన్ షాపులను ఏర్పాటు చేసి 1.2 లక్షల తెల్ల రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఈసారి కల్పవాసులు, అఖాడాలు, సంస్థలకు చాలా తక్కువ ధరకు ఆహార ధాన్యాలు అందించేలా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కిలో గోధుమపిండి రూ.5 చొప్పున అందిస్తారు. ఇక కిలో బియ్యం రూ.6కి ఇవ్వనున్నారు. అంతేకాకుండా కిలో చక్కెర రూ.18కి ఇస్తున్నారు. మొత్తం 800 పర్మిట్లు ఇస్తున్నారు.
ఆహార ధాన్యాలతో పాటు వంట చేసుకునేందుకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్లాన్ చేశారు. ఇందుకోసం 25 సెక్టార్లో ఏజెన్సీలను కూడా నియమించారు. ఇవి కల్పవాసులు, అఖాడాలు, సంస్థలకు కొత్త గ్యాస్ కనెక్షన్లు అందిస్తాయి. వాటికి రీఫిల్ చేసే ఏర్పాటు కూడా అందిస్తుంది. అంతేకాకుండా ఖాళీ గ్యాస్ సిలిండర్లు ఉంటే వాటిని కూడా రీఫిల్ చేసుకునే సదుపాయం కల్పించారు.
ఎవరికి ఆహార సమస్య రాకుండా మేళా ప్రాంతంలో 138 షాపుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి అన్నపూర్ణ కోసం ఐదు గోదాములను ఏర్పాటు చేశారు. ఈ గోదాముల్లో 6000 మెట్రిక్ టన్నుల గోధుమపిండి, 4000 మెట్రిక్ టన్నుల బియ్యం, 2000 మెట్రిక్ టన్నుల చక్కెరను అందుబాటులో ఉంచారు.
ప్రతి ఒక్కరికి 3 కిలోల గోధుమపిండి, 2 కిలోల బియ్యం, కిలో చక్కెర అందించేలా ప్లాన్ చేశారు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఈ సౌకర్యం ఉంటుంది. వన్ నేషన్ వన్ కార్డు సౌలభ్యం కూడా ఉంది. ప్రతి షాపులో 100 క్వింటాళ్ల ఆహార ధాన్యాలు ఉంటాయి.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Wheat flour rs 5 per person rice rs 6 check rs govt providing 18k hurry up
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com