Telangana Budget
Telangana Budget 2023: తెలంగాణకు ఇది అసెంబ్లీ ఎన్నికల ఏడాది. మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే 2023–34 బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ ను సభ ముందు ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడుతున్న కీలక బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. మొత్తం బడ్జెట్ 2.90 లక్షల కోట్లు అని హరీష్ రావు తెలిపారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం 37525 కోట్లు, వ్యవసాయానికి కేటాయింపులు రూ.26831 కోట్లుగా చెప్పారు. కీలక రంగాలకు.. ఓట్లు కురిపించే రంగాలకు భారీ కేటాయింపులు చేశారు. ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ భవితవ్యాన్ని కచ్చితంగా ప్రభావితం చేస్తాయి.
అంచనాలే తప్ప ఆచరణ లేదు..
ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే దానిపై ప్రజల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. తీరా బడ్జెట్ ప్రకటించాక.. నిరాశ చెందడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం.. ఊహాజనిత లెక్కలతో.. బడ్జెట్ అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి. కీలక రంగాలకు భారీగా కేటాయింపులు ప్రకటిస్తున్నాయి. కానీ అమలులో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాయి. కేటాయింపులు చేసినట్లుగా నిధుల కేటాయింపు జరుగడం లేదు. అందుకే బడ్జెట్‌పై అంచనాలు ప్రజల్లో సన్నగిల్లుతున్నాయి. కేంద్రం అయినా రాష్ట్రం అయినా ఇదే పరిస్థితి. బడ్జెట్‌ను ప్రజలు నమ్మడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించి ఉంటారనే అంచనాలు ఉన్నాయి.
గతేడాది రూ.2,56,958 కోట్ల బడ్జెట్..
2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్ల బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈసారి దానిని మరో రూ.30 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్లకు పెంచుతారని తెలుస్తోంది.
భారీగా ఆదాయం అంచనాలు..
ఇక వచ్చే 2023–24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటును 15 నుంచి 17 శాతం అంచనా వేసినట్లు సమాచారం. ఇది చాలా ఎక్కువే అయినా… ఈ సంవత్సరం కొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు ఉండటం వల్ల ఈ అంచనాలు వేసినట్లు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి డిసెంబరు వరకు వచ్చిన రాబడిని లెక్కలోకి తీసుకుంటే… వచ్చే ఏడాది ట్యాక్సుల ద్వారా దాదాపు రూ.1.5 లక్షల కోట్లు వస్తాయనే అంచనా ఉంది. అలాగే ఇతర ఆదాయాల రూపంలో మరో రూ.1.5 లక్షల కోట్లు వస్తాయనే లెక్కలతో.. ఈ బడ్జెట్‌ని రూపొందించినట్లు తెలిసింది.
ఎన్నికలపై ప్రభావం..
ఏ రాష్ట్రంలోనైనా.. నాలుగేళ్ల పాలన కంటే.. చివరి సంవత్సరం చేసిన పాలన ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్ ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల ఎన్నికలు రావడానికి ఇంకా 8 నెలల సమయం ఉంది. ఈ కాలంలో ప్రభుత్వం చూపించే చొరవ, తీసుకునే నిర్ణయాలు, చేసే అభివృద్ధి పనులు, అమలయ్యే పథకాలు.. ఎన్నికల్లో ఓట్ల రూపంలో పడతాయి. ఈ అంశాల్ని లెక్కలోకి తీసుకోవడం వల్లే ఈసారి భారీ బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. మరి ఈ కేటాయింపులు.. కాగితాలకే పరిమితం కాకుండా.. ఆచరణలోకి వస్తేనే.. ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Telangana Budget
కీలకరంగాలకు భారీగా కేటాయింపులు..
తెలంగాణలో హరీశ్‌రావు నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టి.. ప్రసంగిస్తారు. అటు శాసన మండలిలో ప్రశాంత్‌రెడ్డి.. బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలను నిన్న రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా… దళితుల అభివృద్ధి వ్యవసాయం, సాగునీటిపారుదల,సంక్షేమం, పేదరిక నిర్మూలన, అభివృద్ధికి ఎక్కువ కేటాయింపులు చేశారు.. ప్రధానంగా దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో రైతులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంది.. అలాగే కీలక పథకాలైన దళితబంధు, రైతుబంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి వాటికి ఎక్కువ నిధులు కేటాయించింది. ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయించింది. నీటిపారుదలకు భారీగా నిధులు వెచ్చించింది. దళితుల అభివృద్ధికి అత్యధిక కేటాయింపులు చేసింది.
తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయం, నీటి పారుదల శాఖకు ఎక్కువ కేటాయింపులు చేశారు. ఎస్పీ ప్రత్యేక నిధికి అత్యధిక కేటాయింపులు దక్కాయి. ఏకంగా రూ.36750 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత నీటి పారుదల శాఖకు రూ.26885 కోట్లు, వ్యవసాయానికి రూ.26831 కోట్లు, విద్యుత్ కేటాయింపులు రూ.12727 కోట్లు, ఆసరా ఫించన్ల కోసం రూ.12 వేల కోట్లు, దళితబంధు రూ.17700 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15233 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ.6229 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం రూ.2131 కోట్లు కేటాయించారు.