
తెలంగాణలో ఈ ఏడాది చివరి నాటికి టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా పూర్తవుతుందని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కేటీఆర్ దగ్గర ఉన్న రోడ్ రోడ్ మ్యాప్ ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మాటలదేముంది ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఆచరణలో చేసి చూపించాలి కదా. అప్పుడే అందరిలో నమ్మకం కుదురుతుంది. వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలుస్తామని కేటీఆర్ ప్రకటించడంతో అందరి దృష్టి ఆయనపై పడింది.
ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ ఇప్పట్లో కాదని చెప్పిన ప్రభుత్వం నెల వ్యవధిలోనే గ్లోబల్ టెండర్లు పిలుస్తామని చెప్పడంతో అందరు ఆలోచనలో పడ్డారు. తాజాగా కోటి వ్యాక్సిన్ల కొనుగోలు చేస్తమని చెప్పడంతో వినడానికి బాగుందని చెబుతున్నారు. మొత్తానికి కేటీఆర్ ప్రణాళిక ఏంటో తెలియాలి మరి. వ్యాక్సిన్ కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధరల విషయంలో తీవ్రమైన వ్యత్సాసం ఉంది. టీకాల తయారు చేసే కంపె నీలు ప్రైవేటు వారికి అమ్ముకునేందుకు ఇష్టపడుతున్నాయి. వ్యాక్సిన్ కొనుగోలులో రాష్ర్టాల పాత్ర లేకుండా చేయడం ఇబ్బందికరంగా మారింది.
డిసెంబర్ నాటికి వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ర్ట జనాభా మూడున్నర కోట్లు. అందులో కోటి మందని పక్కన పెడితే రెండున్నర కోట్ల రెండు డోసులు చొప్పున ఐదు కోట్ల వ్యాక్సిన్లు కావాల్సి ఉంది. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ తంతు చూస్తే ఐదు శాతం లోపే. లక్ష్యం రెండున్నర కోట్లు 12.5 లక్షల మందికి ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్లు కేవలం ఆరు నెలల్లో పూర్త చేయడం సాధ్యమేనా? ఏడాది చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న సర్కారు లక్ష్యం మంచిదే అయినా అందుకు తగిన ప్రణాళిక ఉండాలి కదా. ఒక వేళ ప్లాన్ ఉంటే దాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం మంత్రిపై ఉంది. అంతే కాని గాలిలో దీపం పెట్టినట్ట్లుగా ఏడాది చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చె ప్పడం ముందు చూపు లేని చర్యే అవుతుంది.