Narayana and Devulapalli Amar: దేవులపల్లి అమర్ జర్నలిస్ట్ గానే అందరికి తెలుసు. కానీ రాజకీయ నాయకుడిగా మారిపోయారు. ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు తీసుకున్నాక పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారిపోయారు .వ్యక్తిగత విమర్శలకు పెద్దపీట వేస్తున్నారు. నాయకుడెవరైనా విమర్శలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన జర్నలిస్టా? రాజకీయ నేతనా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు జర్నలిస్ట్ గా వ్యవహరించిన అమర్ ప్రభుత్వ సలహాదారుగా విధులు నిర్వహిస్తూ నెలకు దాదాపు నాలుగైదు లక్షలు వేతనం తీసుకుంటున్నారు.
ఇటీవల ఏమైందో ఏమోగానీ సీపీఐ నేత నారాయణ దేవులపల్లి అమర్ మధ్య విద్వేషాలు పెరిగాయి. దీంతో ఇద్దరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఫేస్ బుక్ వేదికగా ఇద్దరు రెచ్చిపోవడం అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇద్దరు వ్యక్తిగ దూషణలకు దిగుతుండటంతో అమర్ ఇలా వ్యవహరించడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: ప్రేమించి పెళ్లి చేసుకొని ఇలా చేసింది.. యువతి రాసిన లేఖ వైరల్..
దేవులపల్లి అమర్ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్లను పలు విధాలుగా దుర్భాషలాడినా తరువాత క్రమంలో వైసీపీలో సలహాదారుగా ఉద్యోగం సంపాదించి తన సంపాదన పెంచుకున్నారు .ఇదే క్రమంలో రాజకీయ నేతగా ఆవిర్భవించారు. వైసీపీ నేతల తీరు ఒంటబట్టడంతో ఆయన కూడా రాజకీయ నేతగా భావించుకుంటున్నారు. అందుకే సీపీఐ నేత నారాయణపై విమర్శలకు దిగుతున్నారనే వాదన కూడా వస్తోంది. దీంతో రాష్టంలో ఏం జరుతుందనే సంశయాలు సగటు పౌరుడిలో వస్తోంది.
నారాయణ, అమర్ ఇద్దరు రెచ్చిపోయి మరీ తిట్టుకుంటున్నారు. బూతు పురాణమే లక్ష్యంగా ఇద్దరు తమ నోటికి పని చెబుతున్నారు. అసలు నారాయణకు అమర్ కు ఎక్కడ గొడవ ప్రారంభమైందో తెలియదు కానీ వారు పరస్పరం దుర్భాషలు ఆడుతున్నారు. తమను జంతువులతో పోల్చుకుంటూ మరి తిట్టుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలనే టార్గెట్ చేసుకుని మరీ తమ లోపలి భావాలు బయటపెట్టుకోవడం విశేషం.
Also Read: ఫస్ట్ నైట్ కు ఇచ్చిన గిఫ్ట్ ను నాగచైతన్యకు తిరిగిచ్చేసిన సమంత