spot_img
Homeజాతీయ వార్తలుSingareni Elections - KCR : నల్ల నేలల్లో కేసీఆర్ గులాబీ బాణం విరగడానికి కారణాలు...

Singareni Elections – KCR : నల్ల నేలల్లో కేసీఆర్ గులాబీ బాణం విరగడానికి కారణాలు ఎన్నో?

Singareni Elections : పాలనలో మితిమీరిన జోక్యం ఎక్కువ కావడంతో కెసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు వద్దనుకున్నారు. తెలంగాణకు సిరిలాంటి సింగరేణి గనుల్లో కేసీఆర్ కుటుంబం పెత్తనం కూడా పెరిగిపోవడంతో ఇక్కడ కూడా రిక్త హస్తమే అందించారు. సింగరేణి గనుల్లో ఈసారి బీఆర్‌ఎస్‌ గులాబీ జెండా కనుమరుగైంది. రెండు సార్లు సింగరేణి గుర్తింపు సంఘంగా కొనసాగిన ఆ పార్టీ అనుబంధ విభాగం టీబీజీకేఎస్‌ ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్యంగా వెనక్కి తగ్గింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఓటమి చెందింది. వాస్తవానికి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీకి టీబీజీకేఎస్‌ ఆసక్తి చూపలేదు.. ఫలితంగా కీలక నాయకులు రాజీనామా చేశారు. అంతే కాదు పదేళ్ళుగా సింగరేణిలో ఆడింది ఆట.. పాడింది పాటగా సాగించుకున్న టీబీజీకేఎస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పాటే కనుమరుగైయ్యారు. బీఆర్‌ఎస్‌ అగ్రనేతల తొందర పాటు నిర్ణయంతో సింగరేణిలో టీబీజీకేఎస్‌ వెనుకంజ వేయాల్సి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్నికల్లో పోటీ చేస్తామని
ప్రకటించినప్పటికీ నష్టం జరిగిపోయింది.

శాసనసభ ఎన్నికల్లో కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లోని 12 నియోజకర్గాల్లో కేవలం ఆసిఫాబాద్‌ లోనే బీఆర్‌ఎస్‌ గెలుపొందింది. అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సం ఘం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం తేల్చి చెప్పింది. ఫలి తంగా టీబీజీ కేఎస్‌ అగ్రనాయకులంతా కాంగ్రెస్‌ గూటికి చేరుకునే యత్నాలు సాగిం చారు. అయితే టీబీజీకేఎస్‌ ముఖ్య నాయకులు సింగరేణిలో సాగించిన పైరవీలు, దందాల మూలం గా కార్మిక వర్గంలో అగ్ర నాయకులపై తీవ్ర వ్యతిరేకతను గుర్తించిన కాంగ్రెస్‌ వారి చే రికలను అనుమతించలేదు. ‘తొలుత మీ కేడర్‌ను ఐఎన్ టీయూసీలో చేర్పించండి ఎ న్నికల తర్వాత మీ ముఖ్య నాయకులను చేర్చుకుంటామని’ కాంగ్రెస్‌ నాయకత్వం హా మీ ఇవ్వడంతో సింగరేణి వ్యాప్తంగా తమ క్యాడర్‌ను టీబీజీకేఎస్‌ నాయకులు ఐఎన టీ యూసీలోకి పంపించడం ప్రారంభించారు. అదే తరుణంలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి ఎన్నికల్లో పోటీలో ఉంటున్నట్లు ప్రకటించినప్పటికి సింగరేణిలో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

మణుగూరు డివిజన్ లో మాత్రమే..

మణుగూరు డివిజన్ లో మాత్రం టీబీజీకేఎస్‌ స్థానిక నాయకులు తమ యూని యన్ గెలుపుకోసం తీవ్రంగా పనిచేశారు. పలితంగా మణుగూరు డివిజనలో ఏఐటీ యూసీ, ఐఎన్ టీయూసీ సంఘాలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా ఇంచు మించు వాటితో సమానంగా ఓట్లు పొందగలిగింది. కేవలం మణుగూరు డివిజన్ స్థానిక నాయకులు పట్టుదలతో సాగించిన ప్రచారం మూలంగా ఆ డివిజన్ లో 728 ఓట్లు పొందగలిగింది. సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్‌కు కేవలం 1,298 ఓట్లు మాత్రమే లబించాయంటే కార్మికుల్లో ఆ యూనియన్ పట్ల నెలకొన్న వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు. గతంలో రెండు సార్లు సింగరేణిలో గుర్తింపు సంఘంగా వెలుగు వెలిగిన టీబీజీకేఎస్‌కు తాజా ఎన్నికల్లో కార్పొరేట్‌ డివిజన్ లో 33, కొత్తగూడెం డివిజన్ లో 36, రామగుండం-1 డివిజన్ లో 37 ఓట్లు, రామగుండం-2 లో 47 ఓట్లు, రామగుం డం-3 డివిజన్ లో 59, భూపాలపల్లిలో 57, మందమర్రిలో 81, శ్రీరాంపూర్‌లో 216 ఓట్లు లభించాయి. కాగా ఇల్లెందు డివిజన్ లో కేవలం ఒక్క ఓటు, బెల్లంపల్లిలో కేవలం మూడు మాత్రమే టీబీజీకేఎస్‌ కు లభించాయంటే ఆ యూనియన్ బ్రాంచి కమిటీ నాయకులు సైతం తమ సంఘానికి ఓట్లు వేయలేదని స్పష్టమవుతోంది. ఇంత దారుణమైన పరిణామాలకు బీఆర్‌ఎస్‌ నాయకత్వం సైతం కారుణమంటూ కార్మికులు నిందిస్తున్నారు.

అవినీతి అక్రమాలకు భారీ మూల్యం

‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు సింగరేణి వ్యవహారాల్లో మి తి మీరి జోక్యం చేసుకున్నారు. సింగరేణి నిధులను తమ పథకాలకు మళ్లించు కున్నా రు. ఇష్టారాజ్యంగా సిఫార్సులు చేశారనే’ ఆరోపణలున్నాయి. ఆ పార్టీ అనుబంధ టీబీజీ కేఎస్‌ నాయకులు సైతం అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. కారు ణ్య నియామకాల్లో లక్షల రూపాయలు ముట్టజెప్పిన వారికే మెడికల్‌ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇప్పించారని, కార్మికుల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి పెద్ద మొత్తాల్లో డబ్బులు దండుకోవడం తమను వ్యతిరేకించే కిందిస్థాయి కేడర్‌ను ఇబ్బందులకు గురి చేయడంతో కార్మికుల్లో ఆ యూనిన పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. చివరికి టీబీజీ కేఎస్‌ చెందిన కొందరు అగ్రనాయకులు ఐఎస్‌టీయూసీలో చేరేందుకు యత్నాలు చేసినప్పటికి వారిపై సింగరేణిలో నెలకొన్న వ్యతిరేకత వల్ల కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు, కోల్‌బెల్ట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వారి చేరికలను అడ్డుకున్నారు.

ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా..

సింగరేణిలో యూనియన్ నాయకుల పైరవీలు దందాలను గతంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దృష్టికి స్థానిక క్యాడర్‌ తీసుకెళ్లినప్పటికి నివారించే చర్యలు తీసుకోలేదు. ఫలితంగా శాసనసభ ఎన్నికల్లో కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లో సింగరేణి కార్మిక కుటుంబాల ఆగ్రహాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చవిచూడాల్సి వచ్చింది. సింగరేణిలో పనిచేస్తున్న అనేక సంఘాలు స్వయంప్రతిపత్తితో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటాయి. కాగా బీఆర్‌ఎస్‌ పాలనలో తమ కార్మిక సంఘం నామమాత్రంగా మారింది. చివరికి యాజమాన్యంతో గుర్తింపు యూ నియన చర్చలు జరిగే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. అన్ని సమస్యల విష యంలో నేరుగా అప్పటి సీఎం కేసీఆర్‌, కల్వకుంట్ల కవితే జోక్యం చేసుకునేవారు. లాభా ల వాటాలు, ఇతర కార్మిక పథకాలు ఏకపక్షంగా ప్రకటించే వారు. ఈ పరిణామాలే సింగరేణిలో కార్మిక సంఘంగా టీబీజీకేఎస్‌ను నిలబెట్టలేకపోయాయని పరిశీలకులు పేర్కొంటు న్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో టీబీజీకేఎస్‌ పనితీరు, లీడర్ల దందాలు చవిచూ సిన కార్మికులు, తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ అనుకూల సంఘానికి మొగ్గు చూపలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular