https://oktelugu.com/

ఆ సహనం వెనుక మతలబేంటి..? : డ్యామేజీ తప్ప ఇమేజీ వస్తుందా..!

టీఆర్‌‌ఎస్‌ లీడర్లు ఒక్కొక్కరుగా సహనం కోల్పోతున్నారా..? ఓ వైపు బీజేపీ నాయకులు చెలరేగిపోతుండడం టీఆర్‌‌ఎస్‌ నేతలకు రుచించడం లేదా..? ఈ మధ్య టీఆర్‌‌ఎస్‌ లీడర్ల మాటలు వింటుంటే అందరికీ అదే అర్థమవుతోంది. అందుకే.. ఒక్కొక్కరుగా తమ వాయిస్‌ వినిపిస్తున్నాయి. బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నారు. తమకు చేతకాక సైలెంట్‌గా ఉండటం లేదని .. సహనంగా ఉంటున్నామని చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. Also Read: టీడీపీ కంచుకోటకు బీటలు ఇదంతా నిన్నటి వరకు కింది స్థాయి లీడర్లు ప్రకటించారు. కానీ.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 13, 2021 / 11:05 AM IST
    Follow us on


    టీఆర్‌‌ఎస్‌ లీడర్లు ఒక్కొక్కరుగా సహనం కోల్పోతున్నారా..? ఓ వైపు బీజేపీ నాయకులు చెలరేగిపోతుండడం టీఆర్‌‌ఎస్‌ నేతలకు రుచించడం లేదా..? ఈ మధ్య టీఆర్‌‌ఎస్‌ లీడర్ల మాటలు వింటుంటే అందరికీ అదే అర్థమవుతోంది. అందుకే.. ఒక్కొక్కరుగా తమ వాయిస్‌ వినిపిస్తున్నాయి. బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నారు. తమకు చేతకాక సైలెంట్‌గా ఉండటం లేదని .. సహనంగా ఉంటున్నామని చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు.

    Also Read: టీడీపీ కంచుకోటకు బీటలు

    ఇదంతా నిన్నటి వరకు కింది స్థాయి లీడర్లు ప్రకటించారు. కానీ.. ఇపుడు నేరుగా సీఎం కేసీఆర్‌‌, ఆయన తనయుడు కేటీఆర్‌‌ రంగంలోకి వచ్చారు. వారూ నిన్నా మొన్నా అవే మాటలు వల్లించారు. నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారసభ పెట్టిన కేసీఆర్‌‌ కాంగ్రెస్ పైనే ఎక్కువగా విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలకూ వార్నింగ్‌లు ఇచ్చారు. తమ సహనానికీ హద్దు ఉంటుందని చెప్పుకొచ్చారు. తాజాగా కేటీఆర్ కూడా అవే మాటలు వినిపించారు. అసలు వీరు ఇంత సహనంగా ఎందుకు ఉండాల్సి వస్తోందనేది ఇప్పుడు టీఆర్ఎస్ క్యాడర్‌కు అనుమానాలు మొదలయ్యాయి.

    టీఆర్‌‌ఎస్‌కు బీజేపీ పెను సవాళ్లు విసురుతోంది. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ ఆ పార్టీని దీటుగా ఎదుర్కోవాల్సి ఉంది. కానీ.. కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల తర్వాత వ్యూహం మార్చారు. బీజేపీని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఇంకేముంది తమ ముందు కేసీఆర్ తల వంచేశారన్న అభిప్రాయానికి వచ్చి బీజేపీ నేతలు చెలరేగిపోతున్నారు. ధర్మపురి అరవింద్ లాంటి నేతలు.. కేసీఆర్‌‌ను కుక్క అంటూ సంభోదిస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినప్పటికీ .. టీఆర్ఎస్ నేతలు ఘాటుగా కౌంటర్ ఇవ్వలేదని దుస్థితి. చివరికి సహనం, పరీక్షలు.. హద్దులు దాటగలమని మాత్రం చెబుతున్నారు. ఇంత సహనాన్ని బీజేపీ విషయంలో ఎందుకు పాటించాలన్నది టీఆర్ఎస్ మెజార్టీ నేతలకు వస్తున్న డౌట్‌.

    Also Read: బాబు మార్క్‌ పాలిటిక్స్‌ : ఎంతైనా అనుభవం కావాలి..!

    తెలంగాణను.. తెలంగాణలో పార్టీని కాపాడుకోవడానికి కొన్ని విషయాలు చెప్పలేనని కేసీఆర్.. పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పుకొచ్చారు. బహుశా కేసులు.. ఇతర అంశాల్లో ఆయనకు ఆందోళన ఉండి ఉండవచ్చని అంటున్నారు. అయితే.. వన్ సైడ్ గా బీజేపీ విషయంలో స్లోగా ఉంటే.. దాన్నే అడ్వాంటేజీగా తీసుకుని కమలం పార్టీ నేతలు తలమీదకెక్కడం.. టీఆర్ఎస్ నేతల్ని విస్మయానికి గురి చేస్తోంది. బీజేపీని స్లో చేయాలన్న వ్యూహంతో కేసీఆర్ ఏదో చేస్తున్నారని.. అంత మాత్రాన తాము సైలెంట్‌గా ఉండబోమని బీజేపీ నేతలు ప్రకటనల ద్వారానే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ సహనంతో ఉంటే మరింత డ్యామేజ్ అవుతుంది కానీ.. పాజిటివ్ రాదని అంటున్నారు. కానీ.. కేసీఆర్, కేటీఆర్‌‌ ఆలోచనలు ఎలా ఉన్నాయో అవి వారికే తెలుసు కదా..!

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్