
KCR- Etela Rajender: ముల్లును ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని మరో వజ్రంతోనే కోయాలి.. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి.. ఇవీ నానుడులు. కానీ శత్రువును.. పాజిటివ్‌గా దెబ్బకొట్టాలి అనేది కేసీఆర్ రాజకీయం. అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు పట్టుకునే నైజం కేసీఆర్‌ది. తెలంగాణలో తెలివైన రాజకీయ నేతగా గుర్తింపు ఉన్న కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలవైపు చూస్తున్నారు. బీజేపీ టార్గెట్‌గా పాలిటిక్స్ చేస్తున్నారు. అదే సమయంలో ఈటల రాజేందర్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్రంలో బలపడుతోంది. గులాబీ నేతలు ఈటలతో తరచూ టచ్‌లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తెలివైన ఎత్తుగడ వేశారు. తన అమ్ముల పొదిలోని శత్రువులను సానుకూలంగా ఢీ కొట్టవచ్చు అనే అస్త్రాన్ని బయటకు తీశారు. టీఆర్‌ఎస్ నుంచి మెడలు పట్టి బయటకు గెంటేసి.. అసెంబ్లీలో ఆయన ముఖం చూసేందుకు కూడా ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడు తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన నామస్మరణే చేసి ఈటల రాజేందర్‌ను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశారు.
Also Read: Pathivada Narayanaswamy Naidu: ఆ వృద్ధ నేతకు క్షోభపెట్టిన చంద్రబాబు..
తెలివైన రాజనీతి..
తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాజనీతిలో దిట్ట. ఆయనకు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో.. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలుసు. ఎవరికి ఏ విధంగా చెక్ పెట్టాలో తెలిసిన రాజకీయ ఉద్దండుడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వినా ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి నేడు తెలంగాణకు ముఖ్యమంత్రిగా రెండు దఫాలుగా తిరుగులేని పాలన సాగిస్తున్నారు. అటువంటి కేసీర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న వేళ, స్వరాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు తెలివిగా చెక్ పెడుతున్నారు.
పాజిటివ్‌గా ట్యూన్ చేస్తున్న గులాబీ బాస్..
తనపై తీవ్రమైన మాటల దాడి చేసే ప్రతిపక్ష పార్టీ నాయకులను పాజిటివ్‌గా ట్యూన్ చేస్తున్నారు కేసీఆర్. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవాలంటే చాలావరకు వారిపై ఒత్తిడి తీసుకురావడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, కేసులు పెట్టడం వంటి వాటిపైన ప్రధానంగా అందరూ దృష్టి సారిస్తూ ఉంటారు. కానీ శత్రువులు చెప్పింది విని, వారి విషయంలో సానుకూలంగా స్పందించి, వారిపై అభిమానం ఉన్నట్టుగా మాట్లాడటం ద్వారా కూడా వారి టోన్ తగ్గించవచ్చని సీఎం కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టం చేశారు.

ఈటలపై ప్రేమ..
తాజాగా అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్‌కు తన మార్కు రాజకీయాన్ని చూపించి తన ప్రసంగంలో అనేకమార్లు ఈటల రాజేందర్, రాజేందర్ అన్న అంటూ ఎంతో పాజిటివ్‌గా ప్రస్తావించారు. అవసరమైతే ఆయన సలహాలు తీసుకుంటామని, ఈటల రాజేందర్ ఈరోజు ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లొచ్చు కానీ ఆయనకు అన్నీ తెలుసు అంటూ ఈటల రాజేందర్ తన మనిషే అన్న తీరులో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈటల రాజేందర్ చెప్పే విషయాలను జాగ్రత్తగా వినాలని, ఆయన లేవనెత్తిన సమస్యలను నోట్ చేసుకోవాలని కూడా హరీశ్‌రావుకు సూచించారు.
ఆ పాజిటివే.. ఈటలకు నెగిటివ్ అవుతుందా?
ఇక సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో ఈటల రాజేందర్ మళ్లీ బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటారు అన్న అనుమానం అన్ని రాజకీయ పార్టీ నేతలలోనూ కలుగుతుంది. ఈటలను సెల్ఫ్ డిఫెన్స్‌లోకి నెట్టింది. తన విషయంలో సానుకూలంగా ఉన్న సీఎం కేసీఆర్‌ను ఈటల రాజేందర్ గట్టిగా తిట్టలేని పరిస్థితిని ఆయన కల్పించారు. ఇక ఇదే సమయంలో తను పార్టీ మారబోనని ప్రతి ఒక్కరికి సంజాయిషీ చెప్పుకునే పరిస్థితిని ఈటల రాజేందర్ కు తీసుకువచ్చారు సీఎం కేసీఆర్.
Also Read:Etela Rajender- KCR: ఈటల.. నీనామమెంతో రుచిరా.. మైండ్‌గేమ్ మొదలెట్టిన కేసీఆర్!?