బార్డర్‌లో డ్రాగన్ చైనా కవ్వింపు చర్యలు వీడడం లేదు. తాము నిబంధనలు బ్రేక్ చేస్తం కానీ తమను భారత్ ఏమాత్రం ప్రశ్నించకూడదనే ధోరణితో వెళ్తోంది. ఎప్పకప్పుడు చైనాకు దీటుగా జవాబు ఇస్తున్న భారత్‌కు భయపడుతూనే మరోవైపు తన ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. చైనా వైఖరితో ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద ఇప్పుడు రణరంగంగా మొదలైంది. చైనా యుద్ధానికి కాలుదువ్వుతున్నట్లే కనిపిస్తోంది.
Also Read: చైనా దుస్సాహాసం.. భారత్ ను హెచ్చరిస్తున్న మీడియా
భారత్–చైనాల సరిహద్దుల్లో తుపాకులు వాడకూడదనే ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సోమవారం రాత్రి తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిగాయి. 1975లో పీఎల్‌ఏకు చెందిన కొంతమంది.. తులుంగ్ లా వద్ద భారత్ ఆధీనంలోని భూభాగంలోకి చొరబడి అక్కడ గస్తీ కాస్తున్న అస్సాం రైఫిల్స్ జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్–చైనా సరిహద్దులో శాంతిని పునరుద్ధరించడానికి చాలా ఒప్పందాలు కూడా జరిగాయి. వీటిలో ప్రధానంగా 1996 ఒప్పందం ప్రకారం ఇరుపక్షాలు ఎప్పుడూ కాల్పులు జరపరాదు. వాస్తవాధీన రేఖకు రెండు కిలోమీటర్ల వరకు జీవ, రసాయన ఆయుధాల వినియోగం, పేలుడు కార్యకలాపాలు, తుపాకులతో వేటాడడం నిషేధం. సైన్యం కేవలం ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే.. తాజాగా చైనా ఆ ఒప్పందానికి తూట్లు పొడిచింది.
సరిహద్దులో చివరిసారిగా తుపాకులు వినియోగించిందీ చైనానే. అయితే.. కాల్పులు జరిగినట్లు చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ స్వయానా ఈ విషయాన్ని ముందుగా ప్రకటించింది. భారత సైన్యం కాల్పులకు దిగితేనే తాము బదులుగా జరిపామని చెబుతోంది. చైనాయే కాల్పులకు దిగి.. తన తప్పును భారత్‌పై నెట్టేసేందుకు ప్రయత్నించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఆ పత్రిక దూకుడు ఇంకా పెంచింది. ‘మేము భారత్‌ను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు అనుసరిస్తున్న చైనా విధానం హద్దులు దాటింది. అతివిశ్వాసంతో పీఎల్‌ఏను, చైనా ప్రజలను కవ్విస్తున్నారు. ఇది కొండ అంచులపై శీర్షాసనం వేసినట్లుంది’ అంటూ ట్వీట్ చేసింది. ఆ పత్రిక ఎడిటర్ హు షిజిన్ తన పర్సనల్ ట్విట్టర్ ఖాతాలోనూ ఈ అక్కసు వెల్లగక్కారు. ‘నా అంచనా ప్రకారం.. 1962కు ముందు తరహాలోనే చైనాను భారత్ చాలా తక్కువ అంచనా వేస్తోంది. చైనా యుద్ధం చేయలేదని తీర్మానించుకుంది. అలా అని చైనా సైన్యం ఏమీ ఊరుకోదు. ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధపడింది. ఘర్షణలో విజయం సాధించగలమన్న విశ్వాసంతో ఉంది. ఇరువర్గాలు సైనిక ఘర్షణకు దిగితే భారత్ అప్పటికంటే దారుణమైన ఓటమిని చవిచూస్తుంది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు.ఆగస్టు 29 తర్వాత భారత్ తన భూభాగంలోని కీలక పర్వతాలపై పట్టు సాధించింది. దీంతో అప్పటి నుంచి డ్రాగన్ దేశం తట్టుకోలేకపోతోంది. భారత్ భూభాగాలను ఆక్రమించాలని కుట్ర పన్నింది. కానీ.. అది సాధ్యం కాకపోవడంతో చైనా దేశం ఇలాంటి విమర్శలకు, హెచ్చరికలకు పాల్పడుతోంది. ప్రధానంగా పాంగాంగ్ సరస్సును స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. అందుకు ప్రయత్నంగా చైనా సైనికులు పర్వత శ్రేణి దగ్గరకు వెళ్లగా అప్పటికే అక్కడ భారత సైన్యం మోహరించి ఉంది.
Also Read: బ్రేకింగ్:భారత్-చైనా బలగాల మధ్య కాల్పులు!
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: What is the real reason behind chinas cheating
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com