
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కష్టాలు మొదలయ్యాయి. జనాకర్షక పథకాలతో రెండోసారి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలు తీర్చడంలో ఆలస్యం చేస్తున్నారనే విషయం తెలుస్తోంది. దీంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. పంటల సీజన్లు ప్రారంభమయ్యే నాటికి రైతుబంధు అందించలేకపోతున్నారు. మొదట్లో పంపిణీ చేసినట్లుగా ఒకేసారి మీట నొక్కి ఇవ్వకుండా చెక్కుల ద్వారా పంపిణీ చేయడం లేదు. విడతల వారీగా అందజేస్తున్నారు.
రైతుబందు సాయం ఆలస్యం కావడంతో పంపిణీలో వాయిదాల పద్ధతి పాటించడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఏపీ సర్కారు సంక్షేమ పథకాలను జగన్ మీటనొక్కి విడుదల చేస్తున్నారు. అలా ఒకే సారి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ కు ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉండడంతో ఆర్బీఐ వద్ద అప్పు చేసి రైతుల ఖాతాల్లో వేయవచ్చు. దీంతో ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని భావించిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. సొంత ఆదాయ వనరుల సమీకరణకే ప్రాధాన్యమస్తున్నారు.
ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు నగదు సర్దుబాటు చేసుకుని రైతుబంధు నిధులు చెల్లిస్తున్నారు. ఒకేసారి జమ చేయడం సాధ్యం కావడం లేదు. వర్షాకాలం పంటల సీజన్ జూన్ 10 తేదీ నుంచి రైతుబంధు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పది రోజుల పాటు సాగే కార్యక్రమంలో నగదు అందించేలా కార్యాచరణ రూపొందించారు. పథకం ప్రయోజనం రైతులకు పక్కాగా చేరేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నారు.
రైతుబంధు పథకంపై రైతులు భారీగానే ఆశలు పెంచుకున్నారు. ప్రత సంవత్సరం పెట్టుబడి కోసం రైతుబంధు కింద నగదు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పి అధికారంలోకి వచ్చింది. దీంతో అన్నదాతలు ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులను నిరాశ పరచకుండా ఉండేందుకు తగిన సమయంలో సాయం అందించేందు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.