Kodali Nani Health: ఏపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరారు. ఎప్పుడూ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలే కొడాలి నాని ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జగన్ పై ఈగ వాలనీయకుండా కాపుకాసే ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

కొడాలి నాని కొద్దికాలంగా తీవ్ర నడుం నొప్పితో బాధపడుతున్నారు. దీనిపై ఇటీవల పరీక్షలు చేయించుకోగా ఆయన కిడ్నీలు పెద్ద రాళ్లు ఉన్నట్టు స్కానింగ్ లో తేలింది. దాంతో నొప్పి తట్టుకోలేక విలవిల లాడుతున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీలో రాళ్లు తొలగించుకోవడానికి సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు.
దీంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేరిన కొడాలి నానికి ఈరోజు ఆపరేషన్ చేసి కిడ్నీలో రాళ్లను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. మరో 2, 3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కొడాలి నానికి రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. 15 రోజుల తర్వాత మరోసారి లేజర్ ట్రీట్ మెంట్ చేయనున్నట్టు సమాచారం.