Homeఎంటర్టైన్మెంట్Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ కు భద్రత కల్పించలేక మహారాష్ట్ర పోలీసులు నానా తంటాలు పడుతుంటే.....

Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ కు భద్రత కల్పించలేక మహారాష్ట్ర పోలీసులు నానా తంటాలు పడుతుంటే.. లారెన్స్ బిష్ణోయ్ తో పంజాబ్ ఖాకీలు ఏం చేశారంటే..

Lawrence Bishnoi: ఈ ఘటనతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంతు పట్టడం లేదు. దీంతో మహారాష్ట్ర పోలీసులు సల్మాన్ ఖాన్ కు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా తన ఇంటి వద్ద భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సెట్ లోకి కూడా ఎవరినీ అనుమతించడం లేదు. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే పంజాబ్ పోలీసులు తల తిక్క పనిచేశారు. ఫలితంగా సస్పెండ్ కు గురయ్యారు..లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అయితే అతడిని ఇంటర్వ్యూ చేసిన కేసులో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంకు పోలీసు అధికారులు సహ మొత్తం ఏడుగురు సిబ్బందిని పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. వెంటనే విధులనుంచి సస్పెండ్ చేసింది.. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం పంజాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ సమయంలో అతడిని టీవీ ఇంటర్వ్యూకు పోలీసులు అనుమతించారు. ఈ వ్యవహారం కాస్త సంచలనంగా మారింది. పైగా సిద్ధిఖి హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ నేరాలు బయటి ప్రపంచానికి తెలిసాయి. దీంతో అతడు కస్టడీలో ఉన్న జైలు వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో 2023 మార్చిలో టీవీ ఛానల్లో లారెన్స్ బిష్ణోయ్ కు సంబంధించిన రెండు ముఖాముఖి కార్యక్రమాలు ప్రచారం అయ్యాయి. ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో పంజాబ్ – హర్యానా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే పంజాబ్ జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ని వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించారని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. జయపురలోని సెంట్రల్ జైల్లో మరో ఇంటర్వ్యూ ఇచ్చాడని వెలుగులోకి తెచ్చింది.

ఏడుగురు సస్పెండ్

లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏడుగురు పోలీస్ అధికారులు సహకరించారని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. వారిలో డిఎస్పి ర్యాంకులో ఉన్న గురుషేర్ సింగ్, వినీత్, ఎస్సై లు రీనా, జగపాల్, సాగిన్త్ సింగ్, ముక్తి ఆర్ సింగ్ (ఏఎస్ఐ), హెడ్ కానిస్టేబుల్ ఓం ప్రకాష్ అన్నారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ కేసు అత్యంత సున్నితం కావడంతో.. సిట్ నివేదిక ఇవ్వడంతో పంజాబ్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు నాటి ఇంటర్వ్యూకు సహకరించిన వారందరినీ సస్పెండ్ చేశారు. ఓ ప్రైవేట్ ఛానల్ లో లారెన్స్ బిష్ణోయ్ కు సంబంధించిన ఇంటర్వ్యు ప్రసారమైంది. అయితే ఈ ఇంటర్వ్యూ ను 2022 సెప్టెంబర్ 3న అర్ధరాత్రి పూట వీడియో కాల్ చేసి తీసారని తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ కొంతకాలంగా జైల్లోనే ఉంటున్నాడు. తన వద్దకు అక్రమంగా సెల్ ఫోన్లను తెప్పించుకుంటున్నాడు. తన అనుచరులతో నిత్యం అందుబాటులోనే ఉంటున్నాడు. హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడు. అతడు జైల్లో ఉండే గాయకుడు సిద్దు మూసే వాలా, ఎన్సీపీ నాయకుడు సిద్ధిఖి పై దాడులు జరిపేందుకు స్కెచ్ వేశాడని.. దానిని అతడి అనుచరులు అమలు చేశారని పోలీసులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular