జనసేనాని పవన్ కళ్యాణ్ ఊగిపోయారు. రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుక సాక్షిగా రెచ్చిపోయారు. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా ఫంక్షన్ కాస్త రాజకీయ సభగా మారిపోయింది. సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. పవన్ కళ్యాణ్ పై కోపంతో సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న వైనం.. ఇక సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో మీడియా వ్యవహరించిన అతిని కడిగిపారేశాడు. సీఎం జగన్ తో బంధుత్వం ఉన్న మోహన్ బాబు , సినీ పెద్దలు నోరుమెదపకపోవడాన్ని ప్రశ్నించారు. అన్నయ్య చిరంజీవి సీని ఇండస్ట్రీ సమస్యలపై జగన్ ను అడుక్కోవద్దని.. పోరాడి సాధించాలని పిలుపునిచ్చాడు. పవన్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. అసలు పవన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఏంటన్నది ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం..
* ప్రసంగంలోని ముఖ్యాంశాలు
•పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తే.. అతను నటించిన సినిమాలు ఆపేస్తే భయపడి కాళ్ల దగ్గరకు వస్తారని అనుకుంటున్నట్టున్నారు. వాళ్లు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.
•నేనయినా, దర్శకుడైనా, నటులైనా చేసిన సినిమాలకే డబ్బులు తీసుకుంటున్నారు.. అడ్డగోలుగా వేల కోట్లు మాత్రం సంపాదించలేదు.. తప్పుడు కాంట్రాక్టులు చేసి సంపాదించలేదు..
•జనాలను ఎంటర్ టైన్ చేసి డాన్సులు వేసి కిందా మీద పడి,
ఒళ్లువిరగ్గొట్టుకుని కృషి చేస్తే డబ్బులు వస్తున్నాయి..
•కోట్లు పెట్టుబడితో సినిమాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తానంటోంది.. కష్టం మేము పడితే టిక్కెట్లు మీరు అమ్ముకుంటారా?
•చిత్ర పరిశ్రమ చిన్నది అనుకుంటున్నారు.. ప్రభావం మాత్రం చాలా పెద్దది
•చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద పేర్లు ఉన్నవారు ఉన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకుల్ని మూసుక్కూర్చోమని చెప్పలేరా.. ఇండస్ట్రీ వైపు చూడొద్దని చెప్పలేరా.. మాట్లాడేందుకు మీకు ధైర్యం లేదా
•భయపడడానికి ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్
•వైసీపీ రిపబ్లిక్ అని మాట్లాడితే జనం బయటకు లాక్కొచ్చి కొడతారు..
•అధికారం ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు లేకుండా పోతారు
•అధికారంలో ఉన్న వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి
•గఢాఫీ లాంటి నియంతల్నే చేసిన తప్పులు వెంటాడి చివరికి చిన్న కుర్రాళ్లు కొట్టి చంపేశారు
•మీడియా దృష్టి పెట్టాల్సింది సినిమా వాళ్ల మీద కాదు.. అక్రమ అర్జిత రాజకీయ నాయకుల మీద..
•చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైన అంశం.. అందుకే చాలా తేలిగ్గా టార్గెట్ చేసేస్తున్నారు.. ఉదాహరణకు తేజుకి బైక్ యాక్సిండెట్ అయితే దాని మీద విపరీతార్ధాలతో కథనాలు వేశారు
•దేశంలో ఇంతకంటే ఇంట్రస్టింగ్ కథనాలు లేవా?
•వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు అనే దాని మీద మాట్లాడండి
•కోడి కత్తితో ఒక నాయకుడిని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో పోడిస్తే నాటి గవర్నర్ గారు సైతం దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు.. అది ఏమయ్యిందో అడగండి..
•లక్షలాది ఎకరాల పోడు భూముల్లో గిరిజనలు వ్యవసాయం చేసుకుంటుంటే అవి వారికి దక్కడం లేదు.. ఎందుక దక్కడం లేదనే అంశం మీద మాట్లాడండి
•ఆరేళ్ల చిన్నారిని అన్యాయంగా, అమానుషంగా హ్యత చేస్తే దాన్ని వదిలేసి తేజ్ 45 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లిపోయాడు అనే దాని మీద కథనాలు ఎందుకు?
•బాగా స్పైసీగా కథనాలు కావాలి అంటే ఈ మధ్య వైసీపీ సానుభూతిపరులు కొందరు వ్యభిచారాన్ని చట్టబద్దం చేయమంటూ బయటకు వచ్చారు. దాని మీద కథనాలు నడపండి..
•తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి వైసీపీ వచ్చాక కాపు రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు అనే అంశం మీద కథనాలు వేయండి
•రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారో కథనాలు వేయండి.. బోయ కులస్తులకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావడం లేదో దాని మీద కథనాలు నడపిండి.. నేను గౌరవిస్తాను.
•ఇడుపులపాయలో ఉన్న నేలమాళిగల్లో టన్నుల కొద్ది డబ్బుల కట్టలు ఉంటాయని పోలీసు వారు చెప్పుకుంటుంటే విన్నా దాని మీద కథనాలు నడపండి.. అలా నడిపితే వాళ్లు ఇళ్లలోకొచ్చి కడతారు.. అందుకే వాళ్ల గురించి మాట్లాడరు తేజ్ యాక్సిడెంట్ గురించి మాత్రమే మాట్లాడుతారు. అతను అమాయకుడు ఏం చేయలేడు కాబట్టి
•సినిమా వాళ్లు అంటే తైతక్కలు వేసేవాళ్లు అని మాట్లాడుతున్నారు.. సినిమా తీయడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది
•చిత్ర పరిశ్రమలో ప్రాంతీయ తత్వానికి, కుల తత్వానికి స్థానం లేదు.
•ఏ పార్టీ సానుభూతిపరులు ఉన్నా మీకు అన్నంపెడుతున్న పరిశ్రమకు ముందు గౌరవం ఇవ్వండి
•చిత్ర పరిశ్రమ జోలికి వస్తే అంతా ఏకమవ్వండి
•నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి .
• మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరుతున్నా .
•సినిమాలపై ఆధారపడి హైదరాబాద్ లోనే లక్ష ల మంది బతుకుతున్నారు.
• మాలో మాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి.. అది శత్రుత్వం కాదు .
-సాయిధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ కామెంట్స్…
సినిమా విడుదల ముందు సాయితేజ్ ప్రమాదానికి గురికావడం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి.. సాయితేజ్ అని వివరించారు. సాయితేజ్ ఆస్పత్రిలో ఉన్నందువల్లే ఈ కార్యక్రమానికి వచ్చానని వివరించారు. అతివేగమే సాయితేజ్ ప్రమాదానికి కారణమని ప్రచారం చేశారని..
సాయితేజ్ రోడ్డుప్రమాదంపై లేనిపోని కథలు అల్లారని మండిపడ్డారు. ఆటోను దాటే క్రమంలో ఇసుకపై జారిపడి సాయితేజ్ కింద పడ్డాడు. సినిమాలో చెప్పిన విలువలు నిజ జీవితంలో అమలుచేయడం కష్టమని పవన్ అన్నారు.
సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు, కళ్లు తెరవలేదని.. రాజకీయాల్లో దిగజారుడుతనంపెరుగుతోందని పవన్ విమర్శించారు. ‘‘సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై ఏవేవో మాట్లాడుతున్నారని.. వైఎస్ వివేకా హత్య గురించి మీడియా మాట్లాడాలి కోడి కత్తితో ఒక నేతను పొడిచారు, ఆకేసు ఏమైంది? పోడుభూమి సాగు చేసుకునే గిరిజనులపై మాట్లాడాలి వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై మాట్లాడదా? రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు ఆరేళ్ల చిన్నారి ఘటనను వదిలేసి తేజ్ ప్రమాదంపై మాట్లాడుతున్నారు మీకు ధైర్యం ఉంటే రాజకీయ హింస గురించి మాట్లాడాలి’ అని మీడియాను, నేతలను పవన్ ఏకిపారేశారు. సినిమా వాళ్ల గురించి కాదు.. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి.. సినిమా పరిశ్రమ సెన్సిటివ్ పరిశ్రమ.. పవన్ సనిమాలను ఆపేస్తే భయపడిపోతారని వైసీపీ వాళ్లు అనుకుంటున్నారు.. మేం అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం లేదు.కష్టపడి నటిస్తేనే మాకు డబ్బులు వస్తాయని పవన్ వివరించారు.
‘‘అక్రమార్జిత రాజకీయ నాయకుల గురించి మాట్లాడండి. ట్యాక్స్ లు కట్టని వారి గురించి మాట్లాడండి.. మా గురించి కాదు . చిత్రపరిశ్రమ వైపు చూస్తే వైసీపీ వాళ్లు కాలిపోతారు
ఇండస్ట్రీ వైపు చూడొద్దని వైసీపీ వాళ్లకు ఎందుకు చెప్పడం లేదు. అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పు అని మనం చెప్పాలి . ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటి? .ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్..ఇది వైసీపీ రిపబ్లిక్ అనుకుంటే జనం తిరగబడతారు . సినిమా పరిశ్రమకు కులాలు, మతాలు ఉండవు . సినిమా పరిశ్రమలో అనేక కష్టాలు ఉంటాయి? సినీ పరిశ్రమ జోలికి వస్తే మనమంతా కలవాలి. నేను ఎవరి కులం చూడను.. వ్యక్తిత్వానికే విలువ ఇస్తా . సినిమావాళ్లు దోపిడీలు, దొమ్మీలు చేయడం లేదు.. కష్టపడుతున్నారు.. ’’ అని పవన్ నిప్పులు చెరిగారు.
‘‘నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి.. మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరుతున్నా . సినిమాలపై ఆధారపడి హైదరాబాద్ లోనే లక్ష మంది బతుకుతున్నారు. మాలో మాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి.. అది శత్రుత్వం కాదు.. సినిమావాళ్ల కష్టాలపై మోహన్ బాబు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి మోహన్ బాబు వైసీపీ నేతలకు చెప్పాలి ఇవే నిబంధనలు రేపు మోహన్ బాబు విద్యాసంస్థలకూ వర్తిస్తాయి’’ అని పవన్ సినీ ప్రముఖుడు మోహన్ బాబును గట్టిగా నిలదీశారు.
ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కాబట్టే సినిమా టికెట్లు అమ్మే ఆలోచన చేస్తోందని పవన్ విమర్శించాడు. ‘సినిమా టికెట్ల ఆదాయం చూపించి బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వం తీరు మారాలి. మీ వైఖరి మార్చేందుకు ఏం చేయాలో మాకు తెలుసు. తెలుగు చిత్రపరిశ్రమను ఎవరూ అడ్డుకోలేరు. ఆపలేరు.. జైహింద్’ అంటూ పవన్ వీరావేశంతో ముగించారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: What did pawan kalyan say at the republic film festival why the controversy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com