Rains : ఏమిటీ కాల వైపరీత్యం.. ఎండాకాలంలో ఈ అకాలవర్షాలు దేనికి సంకేతం?

Rains : తెలంగాణలో కొండపోత వానలు కురుస్తున్నాయి. వడగళ్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరి జోరు వానలు ఇంకెన్నాళ్లు కురుస్తాయి..? వాతావరణ శాఖ ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. గత కొద్ది రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులు చూస్తుంటే ప్రస్తుతం వర్షాకాలం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చలికాలం ముగిశాక.. వేసవికాలం రాకుండా నేరుగా వర్షాకాలం వచ్చేసినట్లు అనిపిస్తోంది. గత నాలుగైదు రోజులుగా వానలు అంతలా దంచి కొడుతున్నాయి. అది కూడా సాధారణ వర్షాలు కాదు. […]

Written By: NARESH, Updated On : March 19, 2023 8:15 pm
Follow us on

Rains : తెలంగాణలో కొండపోత వానలు కురుస్తున్నాయి. వడగళ్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరి జోరు వానలు ఇంకెన్నాళ్లు కురుస్తాయి..? వాతావరణ శాఖ ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం.

గత కొద్ది రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులు చూస్తుంటే ప్రస్తుతం వర్షాకాలం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చలికాలం ముగిశాక.. వేసవికాలం రాకుండా నేరుగా వర్షాకాలం వచ్చేసినట్లు అనిపిస్తోంది. గత నాలుగైదు రోజులుగా వానలు అంతలా దంచి కొడుతున్నాయి. అది కూడా సాధారణ వర్షాలు కాదు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాబోయే మూడు రోజుల్లో కూడా..

యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఉత్తర కోస్తాంధ్ర, యానంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇకపోతే గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. వడగళ్ల వానల వల్ల పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. వారితోపాటు మామిడి, మిర్చి పంటలు ధ్వంసం అయ్యాయి. ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు పడతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉరుములతో కూడిన వర్షాలు..

ఆదివారం నుంచి ఈ నెల 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వేస్తాయని పేర్కొంది. ఈ మేరకు యెల్లో అలర్ట్ ను జారీ చేశారు. మార్చి 22 నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని ఐఎండి హైదరాబాద్ తెలిపింది. అక్కడక్కడ తేలుకు పాట నుంచి మోస్తారు వానలో మాత్రమే పడతాయని వెల్లడించింది. వర్షాలు తగ్గిన తర్వాత ఎండలు మళ్లీ దంచి కొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాదులో ఆదివారం ఆకాశం మేఘావృతమై ఉంది. రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు 18 డిగ్రీలు గా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags