గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి యావత్ ప్రపంచం పై పంజా విసరడంతో ఎన్నో శుభకార్యాలు తూతూమంత్రంగా సాగిపోతున్నాయి. ఈ క్రమంలోనే జీవితంలో ఎంతో వేడుకగా జరుపుకోవాల్సిన వివాహ కార్యక్రమాలు కూడా కేవలం వరుడు వధువు కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతున్నాయి.అయితే ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితుల నుంచి ఊపిరి పీల్చుకోవడంతో గత ఐదు నెలల నుంచి వాయిదా పడుతూ వస్తున్న వివాహాలన్నింటిని జరిపించడానికి సిద్ధమయ్యారు.
ప్రస్తుతం శ్రావణ మాసం మొదలవడంతో వివాహాలకు ఈ మాసం ఎంతో అనుకూలమైనదని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే వాయిదాపడిన పెళ్లిళ్లను ఈ మాసంలో జరిపించడం కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శ్రావణమాసం రావడంతో కల్యాణ మండపాలు డెకరేషన్ వీడియోగ్రఫీ వంట వారికి అత్యధిక డిమాండ్ ఏర్పడింది. నెల ముందుగానే కల్యాణమండపాలు కన్వెన్షన్ హాల్ బుక్ చేసుకొని పెళ్లి కార్యక్రమాలను ఏర్పాట్లు చేస్తున్నారు.
పెళ్లిళ్లు చేయడానికి శ్రావణమాసం ఎంతో అనుకూలమైనది. ఈ క్రమంలోనే ఈ నెల మొత్తం మంచి ముహూర్తాలు ఉండడంతో కొన్ని వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. మరి ఈ నెలలో మంచి ముహూర్తాలు ఎప్పుడు అంటే , 13, 14, 16, 18, 20, 21, 22, 25, 26, 27 సెప్టెంబర్ 1వ వరకు ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు మంచి ముహూర్తాలు లేవు. ఆ తరువాత అక్టోబర్ నవంబర్ మాసాలలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి.అయితే శ్రావణమాసంలో 27వ తేదీ వరకు శుభ ముహూర్తాలు ఉండటం వల్ల ఈ తేదీలలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి.