https://oktelugu.com/

కేసీఆర్ వాదనతో రాయలసీమకు నీటి కరువు..!

ఉమ్మడి అంధ్రప్రదేశ్ విడిపోయిన ఏడేళ్లకు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ఏర్పడింది. కృష్ణ జలాల నీటి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువీడని విక్రమార్కుడిలా ఉంటే.. ఏపీ సీఎం జగన్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. అయితే కేసీఆర్ ఈ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకొని ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ జలాల పంపిణీ విషయంలో కొత్త నినాదాన్ని లేవనెత్తారు. కృష్ణ జలాల విషయంలో విభజన ఒప్పందం ప్రకారం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2021 / 01:24 PM IST
    Follow us on

    ఉమ్మడి అంధ్రప్రదేశ్ విడిపోయిన ఏడేళ్లకు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ఏర్పడింది. కృష్ణ జలాల నీటి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువీడని విక్రమార్కుడిలా ఉంటే.. ఏపీ సీఎం జగన్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. అయితే కేసీఆర్ ఈ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకొని ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ జలాల పంపిణీ విషయంలో కొత్త నినాదాన్ని లేవనెత్తారు.

    కృష్ణ జలాల విషయంలో విభజన ఒప్పందం ప్రకారం 66:34 నిష్పత్తిలో నీటిని వాడుకోవాలి.ఇందులో భాగంగా ఇప్పటి వరకు కృష్ణ జలాలను అధికభాగం ఏపీకే కేటాయిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఒప్పందం కాదని కేసీఆర్ 50:50గా నీటిని వాడుకోవాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి సమానంగా నీటి పంపకాలు జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. అంటే మొత్తం కృష్ణ జలాల్లో 811 టీఎంసీలు ఉండగా అందులో 405.5 టీఎంసీలు రెండు రాష్ట్రాలు సమానంగా వాడుకోవాలంటున్నారు.

    అయితే ఇప్పటికే కృష్ణ జలాలు ఎగువ ఉన్న రాష్ట్రాలు ఆనకట్టలు ఎక్కువగా నిర్మించడంతో అరకొరగా వస్తున్నాయి. వచ్చిన వాటిలో సగం సగం అంటే ఏపీకి నీరు తగ్గే అవకాశం ఉంది. దీంతో రాయలసీమ ప్రాంతం తాగునీటికి కూడా కరువు ఏర్పడే ప్రమాదం ఉంది. గతంలో రాయలసీమకు వచ్చినప్పుడు కేసీఆర్ రాయలసీమను రతనాల సీమ చేస్తానని ఇప్పుడు నీటి పంపకం విషయంలో ఇలా మాట్లాడడంపై రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

    కృష్ణ డెల్టా అవసరాలను తీర్చిన తరువాత పట్టి సీమ ద్వారా మిగిలిన నీటిని శ్రీశైలం ద్వారా సీమకు తరలించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా కేసీఆర్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో రాద్దాంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందోనని రెండు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు.