జల జగడం రెండు ప్రాంతాల్లో దుమారం రేపుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికను దృష్టి లో పెట్టుకుని అధికార పార్టీ టీఆర్ఎస్ బలపడాలని చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సైతం తన స్వరం పెంచుతోంది. తెలంగాణ వాదానికి చెక్ పెట్టడానికి ఏపీ ప్రయత్నిస్తోంది. ఇందులో ప్రధానమంత్రి, జలవనరుల శాఖ మంత్రి, న్యాయస్థానాలను ఆశ్రయించి ఉపశమనం పొందాలని చూస్తోంది. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు పోరాటానికే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంల కృస్ణా నదీ జలాల వినియోగంపై గొడవలే ప్రధానంగా కానున్నాయి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్ర వారి కోసమే మౌనంగా ఉంటున్నామని చెబుతున్నా అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. దీంతో భాగ్యనగరంలోనే వ్యాపార సముదాయాలు ఉండడంతో ఆంధ్ర నేతలు భయపడుతున్నారని ప్రచారం సాగుతోంది. తెలంగాణలో సీమాంధ్ర మూలాలు ఉండడంతో ఏఫీ నేతలు తెలంగాణ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదని సమాచారం. హైదరాబాద్ లో సెటిలైన వారు తమ భవిష్యత్తు దృష్ట్యా అధికార టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో తెలిసింది. అయినా సెటిలర్ల కోసం అంటూ పాలకులు చెప్పడం సందేహాలకు తావిస్తోంది.
కేసీఆర్ రాజేసిన నిప్పు ఆయనకే అంటుకునేలా ఉంది. జల వివాదంపై రగడ రాజేసి అంటకాగాలని చూసిన ఆయనకు ప్రతిపక్షాలు కౌంటర్ ఇవ్వడంతో నివ్వెరపోతున్నారు. బీజేపీ మరో అడుగు ముందుకేసి టీఆర్ఎస్ నే బాధ్యులుగా చేస్తూ ఆరోపణలు చేస్తోంది. దీంతో ఎటూ పాలుపోని పరిస్థితి అధికార పార్టీలో నెలకొంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలోనే అధికంగా ఉండడంతో ఇక్కడ 811 టీఎంసీల్లో సగం వాటా దక్కాల్సిందేనని చెబుతున్నాయి.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరో ప్రస్తావన తెచ్చారు. తెలంగాణవాటా కోసం కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలని సూచించారు. దీంతో ఆచరణ సాధ్యంకాని వాదనతో ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. ఒక వేళ రేవంత్ రెడ్డి మాటలకు దీక్ష చేసినా టీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడుతుంది. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది పరిస్థితి.
ఇందులో కేంద్రం జోక్యం చేసుకుంటే సమస్య సత్వరమే పరిస్కారం అవతుంది. కానీ ప్రత్యక్ష సందర్శనతోనే నిజాలు నిగ్గు తేలే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బోర్డు పర్యటిస్తే సరిపోతుంది. నిజాలు వెల్లడవుతాయి. కానీ కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ వివాదాలతో కాలక్షేపం చేయాలని చూస్తున్నాయి. ఇప్పటికైనా జల గొడవలను సాధ్యమైనంత త్వరగా తేల్చాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.