
Vizag Capital – Jagan : ఏపీ సీఎం జగన్ అనుకున్నది సాధించారు. దేశంలోని పారిశ్రామికవేత్తలందరినీ విశాఖలో నిర్వహిస్తున్న ఏపీ పెట్టుబడుల సమ్మిట్ కు తీసుకొచ్చారు. దేశంలోనే నంబర్ 1 ధనవంతుడు అయిన ముకేష్ అంబానీ సైతం ఈ సమ్మిట్ కు వచ్చి ఏపీలో పెట్టుబడులకు హామీ ఇచ్చారు.
ఇక జగన్ విశాఖ వేదికగా సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ మేరకు జగన్ చేసిన ఈ ప్రకటన ఏపీ ప్రతిపక్షాలను ముఖ్యంగా టీడీపీ ని షేక్ చేసింది.
ఎందుకంటే చంద్రబాబు దిగిపోయినప్పటి నుంచి జగన్ మూడురాజధానులు అంటూ అమరావతిని పక్కనపెట్టి విశాఖకు రాజధానిని తరలించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విశాఖనే రాజధాని అని జాతీయ పెట్టుబడుల సమ్మిట్ లో ప్రకటించడంతో టీడీపీ కంగారెత్తిపోయింది.
ఈ వీడియోలను ఇప్పుడు నెటిజన్లు తెగ షేర్ చేస్తూ చంద్రబాబు.. ఆయన అనుకూల మీడియా పెద్దలను ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించాడని.. త్వరలోనే మకాం మార్చబోతున్నాడని.. ఇంకేముంది చేయడానికి ‘పిసుక్కోవడమే’ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.