తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసేందుకు జగన్ కంటే విజయసాయిరెడ్డి ముందుంటాడు. అవకాశం దొరికినప్పుడల్లా బాబును తనదైన రీతిలో విమర్శలు చేస్తుంటాడు. సమావేశాల్లోనూ.. ట్విట్టర్ ద్వారా.. ఇలా ఏ విధంగానైనా విజయసాయిరెడ్డి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేస్తున్నాడు. తాజాగా ఆయన ట్విట్టర్ లో కొన్ని వ్యాఖ్యలతో మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. ప్రత్యక్షంగా చంద్రబాబు పేరు పెట్టకపోయినా అవి బాబు గురించేనని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.
Also Read: అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఏపీ
‘కూసాలు కదులుతున్నాయి. లొసుగులు, ముసుగులు కరిగిపోతున్నాయి. న్యాయాన్ని ఎంత లోతుకు తొక్కిపెట్టినా అది మట్టి పొరలను చీల్చుకునొ బయటికి వస్తుంది. మాదేవుడు బాబు గారు ఉండా మమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరని కాసేపు భ్రమ పడొచ్చు.. కానీ శాశ్వతంగా తప్పించుకోలేదు’ అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పోస్టు పెట్టడం కలకలం రేపింది.
అయితే ఓటుకు నోటు కేసులో టీడీపీ నాయకులు సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా లు అభియోగాల నమోదుకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరగా ఆ విజ్ఓప్తిని తోసిపుచ్చింది. దీంతో డిశ్చార్జ్ పిటిషన్లపై అప్పీల్ పేరుతో గడువు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును కోరింది.
Also Read: చంద్రబాబు ఆర్థిక మూలాలు దెబ్బతీసే జగన్ అస్త్రమిదే?
ఈ తరుణంలో విజయసాయిరెడ్డి బాబును నమ్ముకుంటే పనిలేదు. ఎన్నిటికైన ఆ కేసులో శిక్ష తప్పదన్నట్లు ట్విట్ చేశాడు. బాబుపై విమర్శలు చేయడంలో జగన్ కంటే ముందుండే విజయ్ సాయిరెడ్డి ఇప్పుడీ ట్వీట్ తో సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్