Vidadala Rajini: చిలకలూరిపేట వైసీపీలో మంత్రి రజిని రచ్చ

పల్నాడు జిల్లాకు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న విజయ్ సాయి రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.చిలకలూరిపేట నియోజకవర్గ రివ్యూ నిర్వహించారు. మిగతా నాయకులను మంత్రి రజిని కలుపుకు వెళ్లడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి.

Written By: Dharma, Updated On : August 24, 2023 2:48 pm

Vidadala Rajini:

Follow us on

Vidadala Rajini: ఏపీలో మరో మహిళా నేత వైసిపి హై కమాండ్కు తలనొప్పిగా మారారు. నియోజకవర్గంలో మిగతా వైసీపీ శ్రేణులకు ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అటు స్థానిక ఎమ్మెల్సీ, ఎంపీ తో ఆమెకు పొసగడం లేదు. వర్గాలను ప్రోత్సహిస్తూ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.దీంతో హై కమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగింది. స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా దక్కడం డౌటేనని తేల్చేసింది. ఇంతకీ ఆ నేత ఎవరంటే మంత్రి విడదల రజనీ. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె ప్రస్తుతం మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె వ్యవహార శైలి పై వైసీపీకి కీలక నేత విజయ్ సాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గత ఎన్నికల్లో అనూహ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గ తెరపైకి విడదల రజిని వచ్చారు. వైసీపీ టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రివర్గ విస్తరణలో అమాత్య పదవి దక్కించుకున్నారు. అయితే ఇటీవల ఆమె అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నాయి. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలతో విభేదాలు ఉన్నాయి. ఎంపీ, ఎమ్మెల్సీ ఒక వర్గంగా ఉన్నారు.మంత్రి రజిని వేరే వర్గానికి కొమ్ము కాస్తున్నారు.ఒకరినొకరు బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. మిగతా నాయకులను మంత్రి రజిని కలుపుకొని వెళ్లడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో విడుదల రజనీకి టిక్కెట్ ఇస్తే తాము సహకరించమని అసమ్మతి నాయకులు తేల్చేశారు. ఆమెను మార్చకపోతే ఇండిపెండెంట్ ను బరిలో దించుతామని కూడా హెచ్చరించారు.అయితే చిలకలూరిపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రజిని పనితీరు బాగోలేదని ఇటీవల ఐపాక్ టీం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇది వైసిపి హై కమాండ్ కు తలనొప్పిగా మారింది.

పల్నాడు జిల్లాకు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న విజయ్ సాయి రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.చిలకలూరిపేట నియోజకవర్గ రివ్యూ నిర్వహించారు. మిగతా నాయకులను మంత్రి రజిని కలుపుకు వెళ్లడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి. దీంతో ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి రజినిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే కొనసాగితే పార్టీ పరిస్థితి దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. గ్రూపు రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఇప్పుడు ఇదే ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అయితే మున్ముందు చిలకలూరిపేట నియోజకవర్గంలో విభేదాలు తారాస్థాయికి చేరే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.