ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చారు. దాదాపు 3 వేల కి.మీలు నడిచి ఒంటిచేత్తో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన జైలుకెళ్లినా.. కష్టకాలంలో ఉన్నా ఒకే ఒక్కరు అండగా నిలబడ్డాడు. ఆయనే విజయసాయిరెడ్డి. జగన్ కు తోడుగా నీడగా.. నిలబడ్డ ఆయన జగన్ జైలుకు వెళ్లినా ఆయనతోపాటు వెళ్లారు. ప్రతీ కష్టంలోనూ ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సుఖంలోనూ ఆయన వెన్నంటి ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ తర్వాత కీలక నిర్ణయాధికారిగా ఉన్నారు. నంబర్ 2 పొజిషన్ లో జగన్ కు తోడుగా నీడగా నిలబడ్డారు.
మద్యం ప్రియులకు మరోసారి షాక్..!
*కృష్ణార్జులుగా జగన్-విజయసాయి
ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఇద్దరిదే నడుస్తోందని చెబుతుంటారు. వారే సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో వీరిద్దరినీ కృష్ణార్జునలు అంటుంటారు. ఇక ఢిల్లీ నుంచి మొదలు గల్లీ దాకా వీరిద్దరూ ఏపీ అభివృద్ధిలో అహర్నిషలు కృషి చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో వీరి ద్వయమే ఇప్పుడు అంతా నడిపిస్తోంది. అర్జునుడిలా వైఎస్ జగన్ యుద్ధం చేస్తుంటే.. శ్రీకృష్ణుడిలా అంతా నడిపించేది విజయసాయిరెడ్డి అంటుంటారని పార్టీలో చర్చ సాగుతుంటుంది. దానికి బలాన్ని ఇచ్చే ఓ ఘటన తాజాగా చోటుచేసుకుంది.
*బలంగా జోడి.. ప్రత్యర్థుల పాలిట దుర్భేద్యం
జగన్-విజయసాయిరెడ్డి జోడి బలంగా ఏపీ పాలిటిక్స్ లో పాతుకుపోతోంది. వీరిద్దరి ద్వయం ధాటికి ప్రతిపక్షాలు సైతం అప్పుడప్పుడు అడుగులు వెనక్కి వేస్తున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును.. టీడీపీ కుట్రలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయసాయిరెడ్డి బాగా కృషి చేస్తున్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇక ఇతర మీడియా సోషల్ మీడియా ద్వారా బాబు బండారం.. లొసుగులు బయటపెడుతూ టీడీపీ శిబిరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇటీవలే ఓ సీనియర్ టీడీపీ ఎంపీ సైతం ఓమాట అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్, విజయసాయిరెడ్డిలు ఎదుర్కొన్నారని.. ఒకరి చేయి ఒకరు వదల్లేదని.. అందుకే వారికి ఈ విజయం వరించిందని.. విజయానికి వారు అర్హులని.. అలా ఉండాలి రాజకీయాల్లో అంటూ వీరిద్దరినీ కొనియాడడం సంచలమైంది.
ఏపీలో 1600కు చేరువలో కరోనా కేసులు
*విశాఖ రాజధాని ఐడియా విజయసాయిదేనట..
రాయలసీమకు చెందిన జగన్ కు విశాఖను రాజధానిగా చేయాలని ఎలా ఐడియా వచ్చిందన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న. పోనీ కర్నూలులోనే దగ్గరగా ఉండే ప్రకాశం జిల్లా దోనకొండలో పెడితే సరిపోయేది కదా అనే ఆలోచన అందరికీ వచ్చింది. అయితే విశాఖ రాజధాని ఐడియా విజయసాయిరెడ్డిదేనని చెబుతుంటారు. రాజధాని లేని ఏపీకి, నిర్మాణం కానీ అమరావతిని నిర్మించేకంటే అప్పటికే హైదరాబాద్ కు ధీటుగా ఉన్న విశాఖను రాజధానిగా చేస్తే డబ్బు ఆదా అవ్వడంతోపాటు సకల సౌకర్యాలు కలుగుతాయని.. దేశంలోనే మంచి నగరంగా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భావించారట.. అందుకే అమరావతిని నిర్మించినా రాని పేరును విశాఖను రాజధానిగా చేస్తే వస్తుందని వీరిద్దరే ప్రతిపాదించారట..ఇటీవల విశాఖ రాజధాని ఐడియా ఎవరిది అని మంత్రి అవంతి శ్రీనివాస్ ను అడగగా.. ఆయన హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఐడియానే విశాఖ రాజధాని అని ఖరాఖండీగా చెప్పారు. మా ప్రాంతానికి రాజధానిని తీసుకొచ్చిన ఘనత.. ఇన్నాళ్లకు విశాఖ రాజధాని అవుతుందంటే దాని వెనుక కృషి, పట్టుదల అన్నీ విజయసాయిదేనని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎంతో సహృదయంతో ఆలోచించి అన్ని సదుపాయాలున్న విశాఖను రాజధాని చేయడంతో తమ కల నెరవేరిందన్నారు. ఇలా విశాఖ రాజధాని వెనుక సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ల కృషి ఉందని తెలియడంతో ఆసక్తి నెలకొంది.
*విజయసాయిరెడ్డి బలమే..
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కావడానికి.. అయ్యాక కూడా ఆయన ప్రాణ స్నేహితుడు ఆత్మగా పేర్కొన్న కేవీపీ రాంచంద్రరావు కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు జగన్ కు సైతం కేవీపీలా విజయసాయిరెడ్డి కనిపిస్తున్నారు. ప్రతీ అడుగులోనూ.. నిర్ణయంలోనూ వీరిద్దరి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మేనేజ్ చేయడంలో వీరిద్దరూ కూడా కీలకంగా వ్యవహరించి విజయం కట్టబెట్టారు. అందుకే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి జగన్ కు బలం అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రతీ పథకం.. ప్రత్యర్థులను చెడుగుడు ఆడడంలో వీరిద్దరి పాత్ర అమోఘం అని చెప్పవచ్చు.
-నరేష్ ఎన్నం