
కరోనా కారణంగా హైదరాబాద్ లో చిక్కుకుపోయి పార్టీ నాయకులకు వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా సూచనలు ఇస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ సెటైర్లు వేశారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వెసులుబాటు దొరికింది. పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు, లోకేష్ లకు చక్కని అవకాశం అని సూచించారు. లాక్ డౌన్ సాకులు చెప్పే వీలు కూడా లేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వచ్చేదాకా అడుగుపెట్టేది లేదంటే శాశ్వతంగా అక్కడే ఉండి పోవాల్సి వస్తుంది, మీ ఇష్టం అంటూ ట్వీట్ చేశారు.
జగన్ కొలువులో సలహాదారు.. రాజీనామా వెనుక కథేంటి?
ఇటలీలో ఉన్న పిల్లలు, గుజరాత్లో ఉన్న జాలర్లు, వేరే రాష్ట్రాల్లో ఉన్న కూలీలు కూడా అందరూ వచ్చేశారు… చంద్రబాబు, లోకేష్ మీరు మాత్రం టీకా వచ్చేవరకు ఇల్లు కదలం అంటున్నారు అని పేర్కొన్నారు.
కోడెల `ఆత్మహత్య’ మిస్టరీపై టీడీపీ, వైసీపీ రాజకీయం!
ఏడాది కానేలేదు, తనేంటో చూపించాడు యువ సిఎం అంటూ జగన్ ఎత్తేశారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తిత్వం ముందు 40 ఇయర్స్ ఇండస్ట్రీ వెలవెలబోతున్నదన్నారు. ఎల్లో మీడియా ఎగరేసి ముద్దాడుతున్నా ప్రయోజనం లేకపోయిందని ఎద్దేవా చేశారు. పరాజయం పాలై 11 నెలలు గడిచినా నేలకు దిగి రాలేక పోయాడు, కొన్ని జీవితాలంతే అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.