Vijay Trisha relationship: పెద్దగా చెప్పుకునే నటుడు కాదు. హావభావాలు అంతగా పలకవు. అయినప్పటికీ తమిళనాడులో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి ఆరాధ్య నటుడు. 85 వేల అభిమానుల సంఘాలకు నాయకుడు. ఫ్లాప్ సినిమా అయినా సరే వందల కోట్లు వసూలు చేసే సత్తా అతడి సొంతం. అందువల్లే అతడిని తమిళనాడులో ఇదయ దళపతి అని పిలుస్తుంటారు. తెలుగులో పవన్ కళ్యాణ్ కు ఏ స్థాయిలో అయితే అభిమానుల బలం ఉంటుందో.. తమిళంలో అతడికి అదే స్థాయిలో అభిమానుల ప్రోత్సాహం ఉంటుంది. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది మేం ఎవరి గురించి చెబుతున్నామో..
తమిళనాడులో ఇటీవల టీవీకే పేరుతో విజయ్ ఒక పార్టీ పెట్టాడు. మానాడు పేరుతో భారీగా సభలు నిర్వహిస్తున్నాడు. త్వరలోనే కోయంబత్తూరు ప్రాంతంలో సభ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. డీఎంకే, అన్నా డీఎంకే రాజకీయాలతో విసిగి పోయిన తమిళ ప్రజలు విజయ్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఒక రకంగా డీఎంకే అవినీతి కూడా దీనికి ప్రధాన కారణం. వాగ్దాటి ఎక్కువగా ఉన్న విజయ్ తమిళ ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగం చేస్తున్నారు. తను తమిళ నాడు రాష్ట్రాన్ని గొప్పగా చేస్తానని చెబుతున్నారు. ద్రవిడ సిద్ధాంతాన్ని.. పెరియార్ భావజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో దూరం కానివ్వనని శపధం చేస్తున్నాడు. అంతేకాదు హిందీకి వ్యతిరేకంగా.. నీట్ వంటి జాతీయ పరీక్షలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. సహజంగా ఇవి తమిళ ప్రజల మనసులను ఆకట్టుకునేవే. ఇంతటితోనే విజయ్ ఆగేవిధంగా కనిపించడం లేదు. పైగా అతడికి విరాళాలు కూడా భారీగానే వస్తున్నాయి. ఖర్చు కూడా విపరీతంగానే పెడుతున్నాడు. అతనితో పొత్తు కుదుర్చుకోవడానికి అధికార డిఎంకె.. ప్రతిపక్ష అన్నా డిఎంకె సిద్ధంగా ఉన్నాయి. అతడు కూడా పొత్తులో ఉంటాడా.. సొంతంగా పోటీ చేస్తాడా అనేది తేలాల్సి ఉంది.
మరి ఆమెతో సంబంధం ఏంటి
విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా? తమిళనాడు రాష్ట్రాన్ని బాగు చేస్తాడా? అనే ప్రశ్నలు పక్కన పెడితే.. అతని వ్యక్తిగత జీవితాన్ని కొంతమంది నాయకులు ప్రశ్నిస్తున్నారు. కొంతకాలంగా విజయ్ తన భార్యతో దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో త్రిషతో అతడు సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. లియో సినిమాలో వారిద్దరు జంటగా నటించారు. ఆ సమయంలో వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. పైగా ఇటీవల త్రిష తమ సంబంధాన్ని బయటపెట్టే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు కూడా చేసింది. విజయ్ పుట్టినరోజు కూడా పరోక్షంగా తను అతను ప్రేమలో ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. విజయ్ కూడా త్వరలోనే ఆమెను తన జీవితంలోకి ఆహ్వానిస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు విజయ్ ఇటు త్రిష అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. ఈ లోగానే విజయ్ త్రిష సంబంధం పై రకరకాల పుకార్లు తమిళనాడులో షికారు చేస్తూనే ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి అవడం ఏమోగానీ.. ముందు త్రిషతో ఉన్న సంబంధాన్ని బయటపెట్టాలని.. భార్యతో ఎందుకు దూరంగా ఉంటున్నాడు చెప్పాలని తమిళనాడు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్ కు తగ్గట్టుగా విజయ్ నడుచుకుంటాడా.. లేక ఆరోపణలను సులువుగా తీసుకుంటాడా.. ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని తమిళ విశ్లేషకులు చెబుతున్నారు.
View this post on Instagram