Homeజాతీయ వార్తలుVijay Court Case Before Oath: ప్రమాణ స్వీకారం కాకముందే.. కోర్టుకు విజయ్.. ఏం జరుగుతోంది..

Vijay Court Case Before Oath: ప్రమాణ స్వీకారం కాకముందే.. కోర్టుకు విజయ్.. ఏం జరుగుతోంది..

Vijay Court Case Before Oath: తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేయడం లాంచనమే. ఇప్పటికే ఆయన గవర్నర్ కు లెటర్ రాశారు. దానికి గవర్నర్ ఒప్పుకున్నారు. దీంతో విజయ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇది విజయ్ అభిమానుల్లో.. టీవీకే శ్రేణులలో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ విజయ్ కి సంబంధించిన ఒక వ్యవహారం ఇప్పుడు మీడియాలో చర్చకు దారితీస్తోంది.

ఎన్నికలకు ముందు విజయ్ నుంచి ఆయన భార్య సంగీత విడాకుల కోరింది. ఆయన ఒక సినీ నటితో సంబంధంలో ఉన్నట్టు ఆమె అందులో ఆరోపించింది. ఎన్నికలకు ముందు సంగీత ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో విజయ్ రాజకీయ భవితవ్యం ఒకరకంగా ప్రశ్నార్ధకంలో పడింది. అయితే విజయ్ కి సంబంధించిన ఈ వ్యక్తిగత వ్యవహారాన్ని తమిళ ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. విజయ్ పార్టీకి ఏకం లగా 108 సీట్లు కట్టబెట్టారు.

ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. విజయ్ విడాకుల కేసు ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఈ కేసును చంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు విచారించింది. జూన్ 15 కు వాయిదా వేసింది.. నాడు సంగీత, జై తమ ముందు హాజరుకావాలని పేర్కొంది.. విజయ్ ప్రమాణస్వీకారం త్వరలో చేస్తుండడం.. ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్రాన్ని ఏలబోతున్న నేపథ్యంలో.. చెంగల్పట్టు కోర్టు ఆయనకు మినహాయింపు ఇస్తుందా.. అనే ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది.

ఒకవేళ వ్యక్తిగతంగా హాజరు కాకపోతే విమర్శలు తప్పవు. హాజరైతే విడాకుల కోసం కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి అనే ప్రచారం కూడా జరుగుతుంది. విజయ్ , త్రిష సంబంధం అధికారికంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో ఆ బంధానికి ప్రజల నుంచి గ్రీన్సిగ లభించింది అని టీవీ కే కార్యకర్తలు అంటున్నారు.. సంగీత ఏదో జరుగుతుందని భావించారని.. చివరికి విజయ్ గెలవడంతో ఆయన భార్యహోదాని కూడా కోల్పోయారని టీవీ కే కార్యకర్తలు అంటున్నారు. మరికొందరేమో సంగీత మంచి నిర్ణయం తీసుకుందని.. ఆత్మ గౌరవాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం లేదని ఆమెను సమర్థించారు..

విజయ్ సంగీత కోరినంత భరణం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అందువల్లే ఎన్నికల ముందు సంగీత నిశ్శబ్దంగా ఉన్నారని సమాచారం. ఒకవేళ త్రిష గనుక విజయ్ రాజీనామా చేసే స్థానం నుంచి పోటీ చేస్తే.. అప్పుడు కథ వేరే విధంగా ఉంటుంది. ఒకవేళ ఆమె తిరుచి ఈస్ట్ నుంచి గెలిస్తే జయలలిత, ఎంజీఆర్ ఎపిసోడ్ రిపీట్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version