https://oktelugu.com/

పార్లమెంట్ సాక్షిగా రాత్రంతా కదంతొక్కిన ఎంపీలు

రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపేందుకు ప్రవేశపెట్టారు. దీన్ని అడ్డుకున్న 8 మంది సభ్యులను చైర్మన్‌ వెంకయ్యనాయుడు సస్పెండ్‌ చేశారు. అయితే వారు నిన్న రాత్రి వరకు కూడా పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన చేస్తూ కనిపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. వారిని అక్కడినుంచి పంపేందుకు గార్డులు విశ్వప్రయత్నాలు చేసినా వినలేదు. Also Read: భీవండి ఘటనలో 20కు చేరిన మృతుల […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 12:26 pm
    Follow us on

    mps

    రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపేందుకు ప్రవేశపెట్టారు. దీన్ని అడ్డుకున్న 8 మంది సభ్యులను చైర్మన్‌ వెంకయ్యనాయుడు సస్పెండ్‌ చేశారు. అయితే వారు నిన్న రాత్రి వరకు కూడా పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన చేస్తూ కనిపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. వారిని అక్కడినుంచి పంపేందుకు గార్డులు విశ్వప్రయత్నాలు చేసినా వినలేదు.

    Also Read: భీవండి ఘటనలో 20కు చేరిన మృతుల సంఖ్య

    వివాదాస్పద బిల్లు అయిన వ్యవసాయ బిల్లు ఆదివారం సభ ముందుకు వచ్చింది. అయితే సరైన విధానంలో బిల్లు తీసుకురాలేదని పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి పేపర్లు చించేశారు. టేబుళ్లను తోసి నినాదాలు చేశారు. రూల్ బుక్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై విసిరేశారు. సభలో జరిగిన దుమారంపై చైర్మన్ వెంకయ్యనాయుడు లేఖ రాశారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. దీంతో 8 మందిని వారం రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీనిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీవ్, సయ్యద్ నాజీర్ హుస్సేన్, రిపూన్ బోర, టీఎంసీ నుంచి డెరెక్ ఒబ్రెయిన్, సీపీఎం నుంచి కేకే రగేశ్, ఎలమరన్ కరీం, సింగ్, ఆప్ నుంచి సంజయ్ సింగ్ పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేస్తున్నారు.

    రాత్రి వరకు కూడా అక్కడే బ్లాంకెట్‌, పిల్లోలతో ఉండిపోయారు. గాంధీ విగ్రహం వద్ద పాటలు పాడుతూ నిరసన తెలిపారు. తమను సస్పెండ్ చేసి నోరు మూసే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారని విరుచుకుపడ్డారు. తాము రైతుల పక్షాన పోరాడుతామని తేల్చిచెప్పారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పార్లమెంటరీ విధానాలను తుంగలో తొక్కారని సీపీఎం ఎంపీ కరీం విమర్శించారు. నిరసన తెలుపుతున్న ఎంపీలు కూడా తాము ఉన్న ప్రాంగణం వద్ద ఒక అంబులెన్స్.. కావాల్సిన మంచినీరు ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది.

    Also Read: రైతుల శ్రేయస్సు కోసమే ఆ బిల్లులు -మోదీ

    బిల్లుల ఆమోదంతో ఆదివారం ఎంపీలు నిరసనలు తెలపడంతో సభలో రగడ నెలకొంది. సోమవారం సభలో ఒక్క అంశంపై కూడా చర్చించలేదు. జీరో అవర్‌లో కొన్ని అంశాలను లేవనెత్తుదామని ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.