Homeజాతీయ వార్తలుUttarakhand Helicopter Disaster: అహ్మదాబాద్ ఘటనను మర్చిపోకముందే.. ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఇంతకీ ఏం...

Uttarakhand Helicopter Disaster: అహ్మదాబాద్ ఘటనను మర్చిపోకముందే.. ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Uttarakhand Helicopter Disaster: ఈ సంఘటనను మర్చిపోకముందే దేశంలో మరో దారుణం చోటుచేసుకుంది. హిమాలయ పర్వతాలకు దగ్గరలో .. ప్రకృతి సోయగానికి మారుపేరైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రాష్ట్రంలో హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో ఈ ఏడుగురు దుర్మరణం చెందారు. వీరిలో ఒక చిన్నారి కూడా ఉండడం అత్యంత విషాదం. పైలెట్ తో సహా మొత్తం ఏడుగురు సజీవ దహనం అయ్యారని అధికారులు చెబుతున్నారు..

పైలట్ రాజ్ వీర్, విక్రం రావత్, వినోద్, త్రిష్టి సింగ్, రాజ్ కుమ, శ్రద్ధ, రాశి ప్రాణాలు కోల్పోయారు.. హెలికాప్టర్ గౌరికుండ్ అడవుల్లోకి రాగానే భారీగా శబ్దం చేసుకుంటూ కుప్పకూలిపోయింది. హెలికాప్టర్ కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో అందరూ ప్రయాణిస్తున్న వారంతా సజీవ దహనమయ్యారు. నేషనల్ న్యూస్ చానల్స్ లో వస్తున్న వార్తలు ప్రకారం ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున 5:30 కు జరిగిందని తెలుస్తోంది.. ఇటీవల చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో 274 మంది దుర్మరణం చెందారు. ఆదరణని మర్చిపోకముందే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది..

Also Read: Uttarakhand Helicopter Crash : ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్‌ క్రాష్‌.. గంగోత్రి యాత్రలో విషాదం!

ఇంతకీ ఏం జరిగిందంటే
పైలెట్ తో సహా ఈ ఏడుగురు తో కూడిన హెలికాప్టర్ దేవ భూమి రాజధాని ప్రాంతం నుంచి కేదార్ నాథ్ వెళ్లడం మొదలుపెట్టింది. తెల్లవారుజామున హెలికాప్టర్ గాల్లోకి రయ్యిన ఎగిరింది. అయితే అప్పటికి వాతావరణం అనుకూలంగా ఉండడంతో పైలట్ హెలికాప్టర్ రన్ చేయడం మొదలుపెట్టాడు. అయితే గౌరికుండ్ అడవుల్లోకి రావడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పైగా ఇటీవల కాలంలో అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో హెలికాప్టర్ గౌరీకుండ్ అడవిలోకి ప్రవేశించిన తర్వాత ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో అగ్నిమాపక సిబ్బంది.. పోలీసులు గౌరికుండ్ అడవిలోకి వెళ్లారు. మృతదేహాలను అంబులెన్స్ ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు. శకలాలను వేరుచేసి.. కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Also Read: Bipin Rawath Helicopter Crash: ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు బిపిన్ రావత్ హెలికాప్టర్ కూలే వీడియో.. వైరల్

ఇక్కడి వాతావరణం అనుకూలంగా లేదు. ఆకాశం పూర్తిస్థాయిలో మేఘావృతమైంది. ఇలాంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ ముందుకు వెళ్లే మార్గం లేకపోయినట్టుంది. అందువల్లే కుప్ప కూలిపోయింది. ప్రమాదం తీవ్రత భారీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే చుట్టుపక్కల వృక్షాలు మాడిపోయాయి. హెలికాప్టర్ పేలడం వల్ల చుట్టుపక్కల కొంతమేర అడవి కాలిపోయింది. ఇదంతా చూస్తుంటే ప్రమాదం తీవ్రత అధికంగానే ఉన్నట్టు అర్థమవుతోంది. మాకు అందిన సమాచారం ప్రకారం అగ్నిమాపక సిబ్బందితో ఇక్కడికి చేరుకున్నాం. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని” పోలీసులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version