China- America: అగ్రరాజ్యం అమెరికా.. దానికి పోటీగా ఎదుగుతున్న మరో దేశం చైనా. ఈ రెండు దేశాలు ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలాలని భావిస్తున్నాయి. ఇందుకోసం బయటకు కొట్టుకున్నట్లు కనిపిస్తూ.. రహస్య మైత్రిని కొనసాగిస్తున్నాయి. ప్రపంచంలో మరే దేశం ఆర్థికంగా ఎదగకూడాదన్న ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలపై పడుతోంది. రెండు దేశాలు కలిసి ఈయూను ఆర్థిక సంక్షోభంలోని నెడుతున్నాయి.

రష్యాను ఒంటిరి చేయాలని..
అమెరికాతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన దేశం రష్యా. దీనిని ఒంటరి చేయడానికి, ఆర్థికంగా దెబ్బతీయడానికి అమెరికా చేయని ప్రయత్నాలు.. ఇంకా గట్టిగా చెప్పాలంటే పన్నని కుయుక్తులు లేవు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధాన్ని కూడా అమెరికా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పరోక్షంగా యుద్ధాని నెలల తరబడి కొనసాగించేందుకు ఉక్రెయిన్‌కు ఆర్థికసాయం, ఆయుధాలు సరఫరా చేస్తోంది. యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతున్నా.. రష్యాకు లొంగకుండా చూస్తోంది అమెరికా. దీంతో రష్యా సైనిక చర్య ఇంకొన్ని నెలలు కొసాగే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Manipur Landslide: ప్రపంచంలోని ఏ సైనికులకు లేనిది మనకే ఎందుకు?
ఆర్థికంగా దెబ్బతింటున్న రష్యా..
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా ఇప్పటికే నాలుగు నెలలుగా యుద్ధం కొనసాగిస్తోంది. దీనిని అదునుగా చేసుకున్న అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. యురోపియన్ యూనియన్ దేశాలు పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని, ఆర్థిక లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశించింది. పెట్రో ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని నిబంధన విధించింది. సహజంగా అమెరికా సూచనలు పాటించే యురోపియన్ యూనియన్ రష్యాతో వ్యాపార సంబంధాలు నిలిపివేసింది. ఒకవైపు యుద్ధం, మరోవైపు ఆంక్షలతో పైకి గంభీరంగానే కనిపిస్తున్న రష్యా 100 ఏళ్ల తర్వాత రుణ చెల్లింపు విఫలమైంది.

చైనాకు అంతర్గత ప్రోత్సాహం..
మరోవైపు అమెరికాకు దీటుగా ఎదుగుతున్న చైనాను కూడా దెబ్బతీయాలని చూస్తున్నట్లు అమెరికా బయటకు ప్రకటనలు చేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. రష్యాతో సంబంధాలు తెంచుకున్న యురోపియన్ యూనియన్‌ను మిత్రదేశమైన భారత్‌లోకి వెళ్లాలని సూచించాల్సిన అమెరికా అలా చేయడం లేదు. మరోవైపు చైనాలో ఈయు పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడం లేదు. అంటే పరోక్షంగా భారత్ ఎదుగుదలను అడ్డుకోవడంతోపాటు చైనాను ఆర్థికంగా వెనుక నుంచి ప్రోత్సహిస్తోంది. ఈ ఆధిపత్య పోరులో అమెరికా కారణంగా యురోపియన్ యూనియన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది.
Also Read: Nidhhi Agerwal: 60 ఏళ్ల హీరోలకు 28 ఏళ్ళ హీరోయిన్ సై అంటుంది