Janasena Rayalaseema : ‘‘జనసేన బలం కోనసీమకే పరిమితం. ఉత్తరాంధ్ర, రాయలసీమలో నామమాత్రం. జనసేనానికి అభిమానులు మాత్రమే ఉన్నారు. ఓటర్లు లేరు.’’ ఇదీ జనసేన పై అధికార పార్టీ అంచనా. కానీ అధికార పార్టీ అంచనాలను కర్నూలు జనసైనికులు పటాపంచలు చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో తరలివచ్చారు. రాయలసీమలో జసేనన బలం తక్కువ కాదని నిరూపించారు.
కర్నూలు జసైనికులతో సమావేశమయ్యారు మెగా బ్రదర్ నాగబాబు. జనసైనికుల అభిప్రాయాలు, మనోగతాలను తెలుసుకోవడానికి మీటింగ్ నిర్వహించారు. సాధారణంగా సీమలో జనసేన ప్రభావం తక్కువగా ఉంటుందని అధికార పార్టీ వైసీపీ అంచనా వేస్తోంది. కానీ కర్నూలు సమావేశానికి అపూర్వ స్పందన లభించింది. పెద్ద ఎత్తున జనసైనికులు, వీరమహిళలు తరలివచ్చారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగబాబు.. జనసైనికుల స్పందన చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
కడప, చిత్తూరు జిల్లాల్లో జనసేన కొన్ని నియోజకవర్గాల్లో గణనీయమైన ఓటు బ్యాంకు కలిగి ఉంది. అదే అనంతపురం, కర్నూలు జిల్లాలో కొంత బలం తక్కువగా కనిపిస్తుంది. కానీ కర్నూలు సమావేశంతో ఆ అంచనా తప్పని తేలిపోయింది. కర్నూలులో కూడ జనసైనికులు ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తేలింది. గ్రామస్థాయి నుంచి పార్టీ కేడర్ ను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా నాగబాబు పిలుపునిచ్చారు.
రాయలసీమలో ఎన్నడూ లేని విధంగా జనసేనకు స్పందన వస్తోంది. ఇదే ఒరవడి ఇలాగే కొనసాగితే సీమలో జనసేన దున్నేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గణనీయంగా సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. గ్రామస్థాయి నుంచి యువత జనసేనతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉంది. రాయలసీమలో జనసేనను తక్కువగా అంచనా వేసిన వారికి కర్నూలు సమావేశం గట్టి సమాధానం చెప్పిందని అనుకోవచ్చు.