Liquor Selling In Supermarkets: మహారాష్ట్ర సర్కార్ కొత్త ఆదాయ మార్గాలను వెతికే పనిలో పడినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కిరాణా, సూపర్ మార్కెట్లలో మద్యం విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు ఉద్ధవ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే మహారాష్ట్రాలోని సూపర్ మార్కెట్స్, కిరాణా షాపుల్లో మద్యం అమ్మకాలు జరగనున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా చిన్నపాటి ర్యాక్స్ ఏర్పాటు కాబోతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని మద్యానికి కేంద్రంగా మార్చేందుకు మహాసర్కార్ కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.

షెల్ఫ్ ఇన్ షాప్ విధానానికి మహారాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో పాటు కొన్ని నిబంధనలు విధించింది. కొత్తగా డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో ఏర్పాటయ్యే మద్యం దుకాణాలు 1000 చదరపు అడుగులకు దూరంతో ఏర్పాటు చేయాలని ఆదేశిలిచ్చారు. ఈ మార్కెట్లలో కేవలం వైన్ మాత్రమే అందుబాటులో ఉంచుతారు. మిగతా లిక్కర్ అమ్మకానికి అనుమతి లేదని శివసేన సర్కార్ తేల్చిచెప్పింది. ఇది పదేళ్ల క్రితం నాటి ప్రతిపాదనని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం దీనికి తుది రూపు తీసుకురావడంతో సూపర్ మార్కెట్లలో స్టాల్ ఏర్పాటు చేసి వైన్ విక్రయానికి అనుమతులు మంజూరయ్యాయి.

Also Read: మహారాష్ర్టలో నూతన మద్యం పాలసీ.. కిరాణా దుకాణాల్లో అందుబాటులోకి?
సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో వైన్ అమ్మకాలకు అనుమతి ఇవ్వడంపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తప్పుపట్టింది. మహారాష్ట్రను మందు రాష్ట్రంగా మారుస్తున్నారని ఫడణవీస్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతికిస్తున్నట్లు చెప్పారు. కరోనా విజృంభిస్తున్న టైంలో రెండేళ్లుగా ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. బీజేపీ ఆరోపణలపై స్పందించిన శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. వైన్ అంటే లిక్కర్ కాదు.
సూపర్ మార్కెట్లు, కిరాణ దుకాణాలలో వైన్ అమ్మకాలకు మాత్రమే అనుమతి ఇచ్చామని తెలపడంతో పాటు ఆ నిర్ణయాన్ని సమర్థించారు. వైన్ అమ్మకాలు పెరిగితే రాష్ట్రంలోని రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు. వైన్ అమ్మకాలు పెరిగితే దాని ఉత్పత్తి కూడా పెరిగి దానికి అవసరమయ్యే పంటలకు డిమాండ్ పెరుగుతుందన్నారు. తద్వారా రైతులకు మేలు జరుగుతుందని సంజయ్ రౌత్ వెల్లడించారు.
Also Read: పాఠశాలల పున:ప్రారంభంపై ఏం చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
[…] Also Read: ఇదేం చోద్యం.. కిరాణా, సూపర్ మార్కెట్లల… […]
[…] Also Read: ఇదేం చోద్యం.. కిరాణా, సూపర్ మార్కెట్లల… […]