https://oktelugu.com/

రెండు ఎగువ సీట్లు ఆ ఇద్దరికే ఫిక్స్? ఎందుకంటే..?

ఈ ఏడాది ఏప్రిల్ 9న తెలంగాణకి చెందిన ఇద్దరు ఎగువ సభ సభ్యులు వారి పదవీ కాలన్ని పూర్తి చేసుకొని రిటైర్ అవుతున్నారు. అందులో ఒకరు టీడీపీ నుంచి ఎన్నికై బీజేపీలో ఉన్న గరికపాటి మెహన్ రావు, మరొకరు కాంగ్రెస్ కి చెందిన కేవీపీ రామచంద్రరావు. ఖాళీ అవుతున్న ఆ రెండు రాజ్యసభ సీట్లపై తెలంగాణలో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. అయితే ఏపీ కోటాలో రిటైర్ అవుతున్న, టీఆర్ఎస్‌ జనరల్ సెక్రటరి కేకే, మరోసారి తనకు అవకాశం […]

Written By: , Updated On : February 21, 2020 / 11:45 AM IST
Follow us on

ఈ ఏడాది ఏప్రిల్ 9న తెలంగాణకి చెందిన ఇద్దరు ఎగువ సభ సభ్యులు వారి పదవీ కాలన్ని పూర్తి చేసుకొని రిటైర్ అవుతున్నారు. అందులో ఒకరు టీడీపీ నుంచి ఎన్నికై బీజేపీలో ఉన్న గరికపాటి మెహన్ రావు, మరొకరు కాంగ్రెస్ కి చెందిన కేవీపీ రామచంద్రరావు. ఖాళీ అవుతున్న ఆ రెండు రాజ్యసభ సీట్లపై తెలంగాణలో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది.

అయితే ఏపీ కోటాలో రిటైర్ అవుతున్న, టీఆర్ఎస్‌ జనరల్ సెక్రటరి కేకే, మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కానీ
కేకే కి అవకాశాలు తక్కువనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎందుకంటే కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని కెసిఆర్ భావిస్తున్నారు. అలాగే నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత, పొంగులేటి శ్రీనివాసుల పేర్లు రేస్ లో ఉన్నాయి. కాబట్టి కేకే కి అవకాశాలు తక్కువ.

అలాగే వివిధ కారణాల వల్ల కవిత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజమాబాద్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు కవిత. పంచాయతీ, పురపోరు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను రాజ్యసభకు పంపడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో రెండో సీట్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.