
సోషల్ మీడియాలు పలు విషయాల్లో ప్రచారం చేస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ పై కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతుందని ట్విటర్ వ్యాఖ్యలను ఖండించింది. ట్విటర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు చేసిందని తెలిపింది.
ట్విటర్ ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని ఐటీ శాఖ ఆరోపణలు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశానికి ట్విటర్ పాఠాలు నేర్పుతోందా అని మండిపడింది. అనవసరపు గోల చేయడం మాని భారతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశమైన ఇండియా ఎప్పుడూ భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తుంని చెప్పింది.
ట్విటర్ చేసిన వ్యాఖ్యలు తమకు అనుకూలంగా లేవని బెదిరించే విధంగా ఉన్నాయని, దీన్నిసహించబోమని కేంద్రం హెచ్చరించింది. మీరు చర్యలతో భారతీయ న్యాయవ్యవస్థను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని, మీరు మాకు నీతి వాక్యాలు చెప్పవలసిన పనిలేదని ట్విటర్ కు కేంద్రం తెలిపింది. ఈ దేశ చట్టాలను కచ్చితంగా పాటించాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ పేర్కొంది.
న్యాయవ్యవహారాల్లో జో క్యం చేసుకునే హక్కు ట్విటర్ కు లేదని కేంద్రం తెలిపింది. భారత్ లో భావ ప్రకటన స్వేచ్ఛ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్విటర్ అనుచిత అభిప్రాయాలను ఆపాదించడం సరికాదని పేర్కొంది. ఇండియాలో తమ సంస్థ ఉద్యోగుల కోసం ట్విటర్ ఆందోళన చేసిన సందర్బంగా కేంద్రం స్పందించింది. కాంగ్రెస్ టూల్ కిట్ అంటూ బీజేపీ నేతలు చేసిన పోస్టులను ట్విటర్ మానిప్యులేటెడ్ మీడియా అంటూ ట్యాగ్ చేసిన విషయం విధితమే. ఢిల్లీ, గుర్గావ్ ట్విటర్ కార్యాలయాలకు నోటీసులు పంపించారు. సమాధానం కోసం వేచి చూస్తున్నామని పో లీసులు చెప్పారు.