Tirumala, TTD: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు. వడ్డీ కాసులవాడు. వరాలిచ్చే దేవుడు అని భక్తులు కొలుస్తారు. శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పలు కార్యక్రమాలు చేపడుతోంది. వెంకటేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులకు సకల సదుపాయాలు చేపడుతోంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్ల నుంచి దేవుడి దర్శనం వరకు అన్ని చోట్ల భక్తుల సౌకర్యార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో తిరుమల (Tirumala) వెళ్లేందుకు భక్తులు నిరంతరం ఆసక్తి చూపుడున్నారు వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఆటంకాలు లేకుండా చూస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి భక్తుల కోసం సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అన్నమయ్య భవనంలో గురువారం ఉదయం ప్రారంభించారు. రోజుకు 200 మందికి అందించనున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం అందిస్తోంది. అదే రీతిల దేశీయ వ్యవసయా పద్ధతుల్లో పండించిన బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన అల్పాహారం, భోజనం అందజేస్తున్నారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాటి తయారీకి అయ్యే ఖర్చుకు సమానమైన ధరకే భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది. అందులో భాగంగా సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. భోజనంపై భక్తుల అభిప్రాయాలు, సూచనలు తీసుకునేందుకు సెప్టెంబర్ 8 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దీంతో భక్తుల ఆకలి తీర్చేందుకు టీటీడీ నిర్ణయం తీసుకోవడంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసిన పదార్థాలు భక్తులకు మేలు చేస్తాయని చెబుతున్నారు. దీంతో టీటీడీ నిర్ణయాన్ని అందరు స్వాగతిస్తున్నారు.
రసాయనిక ఎరువుల వాడిన వస్తువులతో మనుషుల ఆరోగ్యం చెడిపోతుందని ఇటీవల ప్రచారం విరివిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సంప్రదాయ పద్దతుల్లో పండించిన పంటలను భక్తుల కోసం వాడడంతో వారిలో ఉత్సాహం పెరుగుతోంది. తినాలని కోరికగా చూస్తున్నారు. టీటీడీ నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి స్పందన బాగుందని చెబుతున్నారు.