https://oktelugu.com/

TRS vs BJP: కేంద్రాన్ని ఇరుకునపెట్టే టీఆర్ఎస్ ప్లాన్?

TRS vs BJP: కేంద్రంలోని బీజేపీ జాతీయ వాదాన్ని ఆయుధంగా వాడి గెలుస్తుంటే.. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ‘ప్రాంతీయవాదాన్ని’ రెచ్చగొడుతోంది. అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఎన్ని సార్లు గెలిచిందో చెప్పక్కర్లేదు. టీఆర్ఎస్, బీజేపీ రెండింటిదే అదే వాదం..కానీ అది దేశంలో చేస్తే ఇది రాష్ట్రంలో చేస్తుంది.. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బీజేపీపై ఇప్పుడు ప్రాంతీయవాదాన్ని వాడుకొని ఇరుకునపెట్టాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా గులాబీ బ్యాచ్ ముందుకు సాగుతున్నట్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 31, 2022 1:25 pm
    Follow us on

    TRS vs BJP: కేంద్రంలోని బీజేపీ జాతీయ వాదాన్ని ఆయుధంగా వాడి గెలుస్తుంటే.. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ‘ప్రాంతీయవాదాన్ని’ రెచ్చగొడుతోంది. అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఎన్ని సార్లు గెలిచిందో చెప్పక్కర్లేదు. టీఆర్ఎస్, బీజేపీ రెండింటిదే అదే వాదం..కానీ అది దేశంలో చేస్తే ఇది రాష్ట్రంలో చేస్తుంది..

    Modi-Shah-KCR-KTR

    ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బీజేపీపై ఇప్పుడు ప్రాంతీయవాదాన్ని వాడుకొని ఇరుకునపెట్టాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా గులాబీ బ్యాచ్ ముందుకు సాగుతున్నట్టు అర్థమవుతోంది.

    రాష్ట్ర హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేసేందుకు తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చాడు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం సహకారం అవసరమన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్ మెక్ స్పా ముదుకొచ్చిందన్నారు. కేంద్రం సహకరిస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పింవచ్చని.. దేశంలోని నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని కేంద్రం నుంచి రావాల్సిన నిధుల లెక్కను కేటీఆర్ విడమరిచి చెప్పి నిలదీశారు.

    పనిలో పనిగా ఏపీ తరుఫున కేటీఆర్ వకాల్తా పుచ్చుకున్నారు. ఏపీకి కూడా ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేయడం విశేషం. దీన్ని బట్టి టీఆర్ఎస్ వ్యూహం పక్కాగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని.. నిధుల కేటాయింపులో అలసత్వాన్ని ప్రశ్నించేందుకు టీఆర్ఎస్ రెడీ అయ్యింది.

    ఇప్పటికే పార్లమెంట్ లో కేంద్రంలోని బీజేపీని నిలదీస్తూ 29 అంశాలను టీఆర్ఎస్ రెడీ చేసింది. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో బీజేపీ టార్గెట్ గా తెలంగాణలో రాజకీయం వేడేక్కించేందుకు కమలదళం రగం సిద్ధం చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.