TRS vs BJP: బీజేపీతో కేసీఆర్ పోటీ కార్యక్రమాలు.. హైదరాబాద్ వాసులకు నరకం చూపిస్తున్నారు!

TRS vs BJP:  ఓ పక్క బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. మరోపక్క టీఆర్ఎస్ పోటాపోటీ ర్యాలీలు, సభలు.. దీంతో ఈ రెండు రోజులు హైదరాబాద్ విలవిలలాడుతోంది. అష్టదిగ్బంధనం అవుతోంది. మోడీ, అమిత్ షా రాకతో బీజేపీ సమావేశాల పేరిట ఆ రోడ్లను బ్లాక్ చేశారు. ఇక టీఆర్ఎస్ పార్టీ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కోసం ర్యాలీ నిర్వహించేందుకు బేగంపేట, జలవిహార్ లను బ్లాక్ చేసింది. దీంతో ఆఫీసులకు, వివిధ పనుల కోసం వెళ్లే […]

Written By: NARESH, Updated On : July 2, 2022 1:27 pm
Follow us on

TRS vs BJP:  ఓ పక్క బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. మరోపక్క టీఆర్ఎస్ పోటాపోటీ ర్యాలీలు, సభలు.. దీంతో ఈ రెండు రోజులు హైదరాబాద్ విలవిలలాడుతోంది. అష్టదిగ్బంధనం అవుతోంది. మోడీ, అమిత్ షా రాకతో బీజేపీ సమావేశాల పేరిట ఆ రోడ్లను బ్లాక్ చేశారు. ఇక టీఆర్ఎస్ పార్టీ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కోసం ర్యాలీ నిర్వహించేందుకు బేగంపేట, జలవిహార్ లను బ్లాక్ చేసింది. దీంతో ఆఫీసులకు, వివిధ పనుల కోసం వెళ్లే వారు నరకం చూస్తున్నారు. హైదరాబాద్ సగం పరిధిలో వెళ్లడానికి వీలు లేక అష్టకష్టాలుపడుతున్నారు. ఒకరకంగా హైదరాబాద్ బందీ అయిపోయిందనే చెప్పాలి.

ఒక పక్క తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏర్పాట్లు.. మరో పక్క బీజేపీ భారీ ఏర్పాట్లు.. వీటన్నింటి మధ్య అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ భారీ బందోబస్తుతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను బంద్ చేశారు. ప్రధాని, కేంద్రమంత్రులు, మంత్రివర్గం, 10 నుంచి 12 మంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా వస్తుండడంతో ‘ఎన్ఐఏ’ పూర్తిగా హైదరాబాద్ ను ఆధీనంలో తీసుకుంది. వాహనాలను, ఇతరులను మోడీ బస చేసే పర్యటించే దరిదాపుల్లోకి కూడా రానీయడం లేదు.

ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ఇదే రోజు హైదరాబాద్ వస్తుండడంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనను ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఆహ్వానించి హైదరాబాద్ లో ర్యాలీ తలపెట్టారు. కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురూ కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేస్తున్నారు.

ఒకే హైదరాబాద్ నగరంలో రెండు భారీ స్థాయి కార్యక్రమాలు.. జాతీయ స్థాయి రాజకీయం అంతా హైదరాబాద్ కేంద్రంగానే సాగుతోంది. అందుకే ఈ ఉదయం నుంచి హైదరాబాద్ లో అడగడుగునా ఆంక్షలు పెట్టారు.

ఇటు ఎన్డీఏ, అటు యూపీఏ హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్న కార్యక్రమాలతో నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ లో పాతబస్తీ సహా నేతలు పర్యటించే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టేసి ఉంచారు. ఇదే సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు పాతబస్తీలోని ‘భాగ్యలక్ష్మీ’ టెంపుల్ కు వెళుతుండడం.. ఆ సెక్యూరిటీ టైట్ చేస్తున్నారు.

ఇలాంటి భారీ కార్యక్రమాలు ఉండడంతో పోలీసులకు రెండు రోజుల పాటు కంటిమీద కునుకు కరువవుతోంది. తిండి ఉండదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈరోజు ఉదయం ప్రభుత్వ, ప్రైవేటు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆఫీసులకు టైంకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.

దీనకంతటికి కారణం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న ఫైట్ పతాకస్థాయికి చేరిందనే చెప్పాలి. ఇద్దరూ ఆధిపత్యం కోసం భారీ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇందులో హైదరాబాద్ ప్రజలు నలిగిపోతున్నారు. తీవ్ర ఇబ్బందులతో అగచాట్లు పడుతున్నారు.

ముఖ్యంగా బీజేపీ ఇప్పటికే జాతీయ కార్గవర్గ సభను పెట్టింది. కానీ దీన్ని జీర్ణించుకోలేని తెలంగాణ రాష్ట్రసమితి అధిపతి, సీఎం కేసీఆర్ పోటీగా ఈరోజే యశ్వంత్ సిన్హా ర్యాలీ పెట్టడమే అసలు వివాదానికి కారణం.. దీంతో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు వచ్చిపడ్డాయి. ఎక్కడికక్కడ ఆంక్షలతో ప్రజలు నరకం చూస్తున్నారు. బీజేపీ ఎప్పుడో పెట్టిన సభకు పోటీగా కేసీఆర్ బీరాలకు పోయి హైదరాబాద్ వాసులకు చుక్కలు చూపిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ హైదరాబాద్ కష్టాలకు కేసీఆర్ కు బీజేపీపై ఉన్న పంతమే కారణమని మండిపడుతున్నారు. పంతాలకు పోయి ప్రజలను ఇబ్బంది పెడుతారా? అని నిలదీస్తున్నారు.