https://oktelugu.com/

Train : జస్ట్ వాటర్ బాటిల్ పడేయడం వల్ల ట్రైన్ కు అంత పెద్ద సమస్య వచ్చిందా?

రైలు ప్రయాణం నచ్చని వారు ఎవరైనా ఉంటారా. కానీ కంఫర్ట్ ముఖ్యం కదా. కొన్ని సార్లు కంఫర్ట్ తో పాటు లగ్జరీ కూడా అనిపిస్తుంది. కానీ కొన్ని సార్లు నరకం కనిపిస్తుంటుందండీ బాబూ.

Written By: , Updated On : February 15, 2025 / 06:00 AM IST
Train

Train

Follow us on

Train : రైలు ప్రయాణం నచ్చని వారు ఎవరైనా ఉంటారా. కానీ కంఫర్ట్ ముఖ్యం కదా. కొన్ని సార్లు కంఫర్ట్ తో పాటు లగ్జరీ కూడా అనిపిస్తుంది. కానీ కొన్ని సార్లు నరకం కనిపిస్తుంటుందండీ బాబూ. మీలో రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం ఏది ఇష్టం అంటే దేనికి ఓటు వేస్తారు? చాలా మంది రైలుకే వేస్తారు. మన ఇండియన్ రైల్వే అంటే చాలా మందికి ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది. టికెట్స్ బుకింగ్, ఆ తర్వాత ట్రైన్ కోసం వెయిటింగ్, వచ్చాక సీట్ల కోసం సెర్చింగ్, ఆ తర్వాత పాసెంజర్లతో టాకింగ్. ఇలా ఈ జర్నీ మొత్తం ఒక కొత్త అనుభూతి ఉంటుంది.

అనుభూతి అంతా ఒకే మరి మీరు ఈ రైలులో ఏవైనా తింటూ ఉంటారా లేదా? అయ్యో ఎందుకు తినం అదొక సపరేట్ ఫీలింగ్ కదా అనుకుంటున్నారా? అయినా ఇంట్లో అన్ని ఉంటే అసలు తినరు. కానీ అందరిలో ఇలా తినడం చాలా మందికి సరదా. సరే మీకు తినడం ఇష్టం లేకున్నా సరే వాటర్ అయితే తాగుతుంటారు కదా. పక్కా తాగాల్సిందే. లేదంటే గొంతు ఊరుకుంటుందా? ఆరిపోదా అని కోపానికి రాకండీ. విషయం అదీ కాదండోయ్. క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా అంటూనే మనం ప్రతిసారి చెత్త పడేస్తుంటాము.

ఇక ట్రైన్ లో తిన్నా సరే, వాటర్ తాగినా సరే డస్ట్ బిన్స్ వాడరు. జస్ట్ అలా విండూ నుంచి పారేయడమే. వాటిని ఏమైనా దూరంగా పారేస్తారా అంటే అసలు కాదు. కిటికీ నుంచి కిందికి పడేస్తుంటారు. దీని వల్ల ఆ వాటర్ బాటిల్స్ వెళ్లి ట్రాక్ లో ఇరుక్కుపోయి ఉంటాయి. ఇలా ఇరుక్కుపోవడం వల్ల ఎంత పెద్ద సమస్య వస్తుందో మీకు తెలుసా? ఈ కింది వీడియో చూస్తే మీకు ఓ క్లారిటీ వస్తుంది.

అయితే ఓ ప్రయాణీకుడు బాటిల్ ను ట్రైన్ నుంచి కింద పడేస్తే ఎంత ప్రమాదమో తెలియక తాను వాటర్ తాగి ఆ బాటిల్ ను కింద పడేశాడు. అయితే ఆ వాటర్ బాటిల్ కాస్త వెళ్లి ట్రైన్ ట్రాక్ మధ్యలో నిలిచిపోయింది. ఇక అదే ట్రాక్ పై నుంచి వస్తున్న ఓ ట్రైన్ లోకో పైలట్ కు వెంటనే స్టేషన్ మాస్టర్ ను అడిగారు. ట్రైన్ ముందుకు వెళ్లవచ్చా అని? దానికి సమాధానంగా ఆయన అవును అని చెప్పారు. కానీ సిగ్నల్స్ మాత్రం ట్రైన్ ను కదలనివ్వలేదు. దీంతో వెంటనే సిబ్బందిని పంపించి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించారు. కానీ చూశారా జస్ట్ బాటిల్ ను పడేయడం వల్ల ఎంత పెద్ద సమస్య వచ్చిందో..

ఇక ప్రతి రోజు ఇండియన్ రైల్వే ఎన్నో వేల ట్రైన్ లను నడిపిస్తుంది. మరి ఇలాంటి సమయంలో మీరు పడేసే వస్తువులు ట్రైన్ లకు ఎంతో సమస్యను కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా ఆలస్యం చేస్తాయి. సో మీరే బాధ్యతగా మీరు వేసే చెత్తను జస్ట్ జస్ట్ బిన్ లో మాత్రమే వేయాలి. దీని వల్ల పర్యావరణాన్ని కాపాడుతూ నీట్ గా ఉంచవచ్చు.