https://oktelugu.com/

విషాదం: ప్రముఖ గాయకుడి కొడుకు మృతి

తెలుగు సినిమా చరిత్రలోనే ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల. ఆయన పూర్తి పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు. కానీ ఘంటసాలగానే ఫేమస్. తెలుగు సినిమా తొలి నాళ్లలో ఘంటసాల పాటలే ఫేమస్. ఆయనను మించిన వారు మరొకరు లేరు. తాజాగా ఘంటసాల రెండో కుమారుడు, డబ్బింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాసవిడిచాడు. ఇటీవల కరోనా బారిన పడిన రత్నకుమార్.. కావేరి ఆస్పత్రిలో […]

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2021 / 02:35 PM IST
    Follow us on

    తెలుగు సినిమా చరిత్రలోనే ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల. ఆయన పూర్తి పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు. కానీ ఘంటసాలగానే ఫేమస్. తెలుగు సినిమా తొలి నాళ్లలో ఘంటసాల పాటలే ఫేమస్. ఆయనను మించిన వారు మరొకరు లేరు.

    తాజాగా ఘంటసాల రెండో కుమారుడు, డబ్బింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాసవిడిచాడు.

    ఇటీవల కరోనా బారిన పడిన రత్నకుమార్.. కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడ్డారు. డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయన గుండెపోటుకు గురై మృతిచెందారు.

    ఘంటసాల రత్నకుమార్ మరణంతో ఆయన కుటుంబంతోపాటు చిత్రపరిశ్రమలో విషాధచాయలు అలుముకున్నాయి.

    ఘంటసాలకు మొత్తం నలుగురు కుమారులు. నలుగురు కుమార్తెలు. కుమారులు విజయ్ కుమార్, రత్నకుమార్, శంకర్ కుమార్, రవికుమార్, కుమార్తెలు శ్యామల, సుగుణ, మీరా, శాంతిలు.

    ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సహా వివిధ భాషల్లో కొన్ని వేల సినిమాలకు, సీరియల్స్ కు డబ్బింగ్ చెప్పారు. దాదాపు 30 సినిమాలకు మాటలు కూడా అందించాడు.