https://oktelugu.com/

Revanth Reddy: నేను పీసీసీ కావడానికి కేసీఆరే కారణం.. బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలందరిలోకి అధికార పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తో సరితూగగల నేతగా పేరుపొందాడు. వాగ్ధాటి, నైపుణ్యాలు, తెలివితేటల్లో ప్రతి విషయంలోనూ కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనగలరు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకే తెలంగాణ కాంగ్రెస్ కు ఊపిరి వచ్చింది. తెలంగాణలో బలంగా పుంజుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా మళ్లీ ఎదిగింది. రేవంత్ దూకుడు ఆ పార్టీకి కలిసి వస్తుంది. ఈ క్రమంలోనే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2021 2:32 pm
    Follow us on

    Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలందరిలోకి అధికార పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తో సరితూగగల నేతగా పేరుపొందాడు. వాగ్ధాటి, నైపుణ్యాలు, తెలివితేటల్లో ప్రతి విషయంలోనూ కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనగలరు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకే తెలంగాణ కాంగ్రెస్ కు ఊపిరి వచ్చింది. తెలంగాణలో బలంగా పుంజుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా మళ్లీ ఎదిగింది. రేవంత్ దూకుడు ఆ పార్టీకి కలిసి వస్తుంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సంచలన విషయాలు పంచుకున్నారు. అవిప్పుడు వైరల్ గా మారాయి.

    revanth reddy trs.jpg22

    revanth reddy

    తాజాగా ఓ మీడియా అధిపతితో రేవంత్ రెడ్డి ‘ఓపెన్ హార్ట్’గా మాట్లాడారు. అసలు తాను పీసీసీ చీఫ్ గా కావడానికి అసలు కారణం కేసీఆర్ యేనని బాంబు పేల్చారు. తానొక చిన్న ఎమ్మెల్యేగా ఉంటే.. తనను లేపి.. అరెస్ట్ లు చేసి.. వెంటాడి..వేధించి జైలుకు పంపి పెద్దలీడర్ గా కేసీఆర్ మార్చాడని.. ఆయనపై పగే తనను నడిపిస్తోందని.. ఈస్తాయికి ఎదిగేలా చేసిందని.. ఆయనను గట్టిగా ఢీకొంటాననే తనకు పీసీసీ చీఫ్ ఇచ్చారని రేవంత్ రెడ్డి సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు.

    తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి సోనియా ఇష్టం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కష్టపడ్డ వారికే దక్కుతుందని.. అధిష్టానం మాట దవజాటనని తెలిపారు.

    ఇక చంద్రబాబు చెబితేనే తనకు పీసీసీ చీఫ్ ఇచ్చారన్నది అబ్దదమని.. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనగల పోరాటం చేస్తాననే.. ఆయనతో లాలూచీ పడననే తనకు ఇచ్చారని రేవంత్ తెలిపారు. రేవంత్ రెడ్డి లో చంద్రబాబు వాసనలు పోలేదని ఇంకా విమర్శలు వస్తున్నారని ఆయన వాపోయారు.

    ఓటుకు నోటు కేసులో ఎలా ముందుకెళ్లాలో తెలియకే కేసీఆర్ ఆగుతున్నాడని.. చంద్రబాబు కోసం ఈ జాప్యం జరుగుతోందని.. ఇది తేలితే రేవంత్ రెడ్డి పని కూడా ఖతం అవుతుందన్న మీడియా అధిపతి ప్రశ్నలకు సైతం రేవంత్ రెడ్డి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.కోర్టుల్లో అవి నిలబడవంటూ మరింత వివరించాడు. ఫుల్ ఎపిసోడ్ లో దీనికి సంబంధించిన విశేషాలు వెల్లడికానున్నాయి.

    ఉంటే ఉండండి.. సీనియర్లు పొమ్మంటే పొమ్మని చెప్పే ధైర్యం తనకు వచ్చిందని.. కాంగ్రెస్ ను అధికారంలోకి రావడానికి ఏమైనా చేస్తానని రేవంత్ తెలిపారు.
    అధికారం ముందు కేసీఆర్ పిచ్చుక అని.. ఒక ఆఫ్ట్రాల్ అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా కేసీఆర్ ను ఆగం చేయగల కెపాసిటీ తనకు ఉందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఎందుకు అధికారం ఉందిరా దేవుడా అని కేసీఆర్ మొత్తుకునేలా చేస్తానని రేవంత్ అన్నారు.కేసీఆర్ ను ఓడించి అడవులల్లోకి పంపడానికి తాను రెడీగా ఉన్నానని తెలిపారు.

    ఇక కేసీఆర్ ను సీఎంగా ఉంచడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని.. మోడీ షాలతో కేసీఆర్ లాలూచీ పడ్డారని రేవంత్ ఆరోపించారు. ఒక వేళ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపితే ఏంటి సంగతి అని మీడియా అధిపతి ప్రశ్నించగా రేవంత్ షాక్ అయ్యాడు. దానికి ఏం సమాధానం ఇచ్చాడన్నది ఆసక్తి రేపుతోంది.

    -ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో రేవంత్ పంచుకున్న సంచలన విషయాల వీడియో ఇదీ..

    TPCC Chief Revanth Reddy Open Heart With RK Promo || Season-3 || OHRK