Tirupati janasena leader Kiran Royal arrest : ఓవైపు విశాఖలో మోడీ-పవన్ భేటి విశాఖలో జరుగుతుంటే.. రెండో వైపు తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ అరెస్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇది నాటకీయ పరిణామం. విశాఖ సంఘటన అక్టోబర్ 17న గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలను ఉలిక్కిపడేలా చేసింది. ఇక ఇప్పటంలో దౌర్జన్యం గుంటూరు, కృష్ణ జిల్లాల్లో జనసేనకు ఊపిరి పోసింది.
ఇప్పుడు తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ అరెస్ట్ తో రాయలసీమ కూడా ఉలిక్కిపడింది. కనీసం నోటీస్ ఇవ్వకుండా.. ముందస్తు సమాచారం లేకుండా మఫ్టీలో వచ్చిన పోలీసులు కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లింది కూడా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ముందు తిరుచానూర్ అన్నారు.. తర్వాత నగరి అంటూ కిరణ్ రాయల్ అరెస్ట్ ను ధృవీకరించలేదు. దీన్ని బట్టి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మరెక్కడనా? అన్నది తెలియకుండా ఉంది.
ఇవన్నీ చూస్తుంటే ఏపీలో జగన్ ది నియంత పాలన సాగుతోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే భయంతో ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. పవన్ ప్రాబల్యం పెరుగుతోందని భయపడుతున్నారు. విశాఖ, ఇప్పటం తర్వాత ఇప్పుడు తిరుపతిలో జనసేన నేత కిరణ్ అరెస్ట్ తో పరోక్షంగా జనసేనకే లాభమైంది. దీనిపై ‘రామ్ గారి’ సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.