Whats app : ఇప్పుడున్న ప్రతీ మొబైల్ లో Whats app తప్పనిసరిగా ఉంటుంది. టెక్ట్స్ మెసేజ్ నుంచి ఫొటోలు, వీడియోలు పంపించుకునేందుకు వీలుగా ఈ యాప్ ఉపయోగపడుతుండడంతో విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగిస్తున్నారు. Whats appకు వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారి అవసరాలు తీర్చే విధంగా దీని మాతృ సంస్థ meta కొత్త కొత్త Features ను అందుబాటులోకి తీసుకొస్తుంది. అప్పటికే ఎన్నో సౌకర్యవంతమైన ఫీచర్లను తీసుకొన్ని వాట్సాప్ ఇప్పుడు 3 ఉపయోగకరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్ల ద్వారా కొన్ని పనులు సులువుగా చేసుకోవచ్చు. అలాగే రక్షణ పొందవచ్చు. వాటి వివరాల్లోకి వెళితే..
Whats app ద్వారా ఎటువంటి డాక్యుమెంట్ నైనా పంపించుకోవచ్చు. వీటిని కొందరు వర్డ్ ఫైల్స్ లేదా.. పీడీఎప్ ఫైల్ మోడల్ లో పంపిస్తుంటారు. అయితే ఎక్కువ పేజీలు ఉన్న వాటినీ పీడీఎఫ్ లాగా మార్చి పంపిస్తుంటారు. అయితే మొబైల్ లో ఇప్పటి వరకు ఈ విధానం ద్వారా పంపించాలంటే సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు వాట్సాప్ ద్వారా పీడీఎఫ్ గా మార్చి పంపించుకోవచ్చు. ఇందు కోసం ముందుగా Whats app లోకి వెళ్లాలి మెసెస్ టైప్ చేసే బాక్స్ వద్ద + అనే సింబల్ కనిపిస్తుంది. దీనిని ప్రెస్ చేయగానే కెమెరా ఆప్షన్ ఆన్ అవుతుంది దీని ద్వారా డాక్యుమెంట్ స్కాన్ చేసిన తరువాత ఆటోమేటిక్ గా పీడీఎఫ్ లోకి మారిపోతుంది. అయితే ప్రస్తుతం ఇది iPhoneలో మాత్రమే అందుబాటులో ఉంది.
Whats app ద్వారా ఆడియో ఫైల్స్ కూడా పంపించుకోవచ్చు. అయితే కొందరు పంపించే ఆడియో అందరి ముందు వినే అవకాశం ఉండదు. కొన్ని సీక్రెస్ టా వినాలని అనుకుంటారు. అయితే ఎదుటి వారు పంపిన ఆడియోను Text రూపంలో మార్చుకునే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇతరులు మీ వాట్సాప్ లోకి ఒక ఆడియోను పంపిన తరువాత దీని కోసం ముందు settings లోకి వెళ్లాలి. ఆ తరువాత chatsపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు voice message transcriptsఅనే ఆప్షన్ ను ఆన్ చేసుకోవాలి. దీంతో వాట్సాప్ లోకి వచ్చిన ఆడియో టెక్ట్స్ రూపంలోకి మారుతుంది. ఈ మెసెజ్ ద్వారా ఎదుటి వారు ఏమి పంపించారో తెలుసుకోవచ్చు.
కొందరు వాట్సాప్ ద్వారా సీక్రెట్ వ్యక్తులను కలుసుకుంటారు. వీరితో చాట్ చేసిన విషయాలు ఇతరులకు తెలియకూడదని అనుకుంటారు. ఇందుకోసం ఇప్పుడు settings లోకి వెళ్లి Lok chatపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మరోసారి పైన కనిపించే సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. ఆ తరువాత Hide locked chatsపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏదైనా సీక్రెట్ కోడ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు పర్సనల్ కు సంబంధించిన చాట్స్ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. వాట్సాప్ ద్వారా పర్సనల్ చాట్స్ కు రక్షణ పొందవచ్చు.