
గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన విపక్షంగా మారిన టిడిపి రోజు రోజుకీ బలహీనపడుతున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ మాత్రం కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వాన చాలా బలంగా పుంజుకుంటోంది. ఇక కమలనాథులతో పాటు రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ఈ విషయమై చాలా ఆశ్చర్యకర అంశాలను తెర మీదకి తీసుకువస్తున్నారు. కొన్ని లెక్కలు అందరూ చెప్పడం ఒక ఎత్తు… ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పడం మరో ఎత్తు..!
Also Read : లోకేష్ పై వాలింటీర్ ని పెట్టి గెలిపిస్తా
క్రియాశీలక రాజకీయాలలో ఇప్పుడిప్పుడే దూకుడుగా వ్యవహరిస్తూ అసలైన రాజకీయం నడిపేందుకు సిద్ధమైన సోము ఇప్పటికే ఏపీలో బీజేపీకి 25 శాతం మేర ఓటింగ్ ఉన్నట్లుగా ప్రకటించారు. ఎంత లేదన్నా వచ్చే ఎన్నికల్లో తాము రాష్ట్రంలో నాలుగోవంతు ప్రభావాన్ని చూపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వీర్రాజు లెక్కలు కాస్తంత ఆశ్చర్యకరంగా…. ఇంటరెస్టింగ్ గా ఉన్నా కూడా మొత్తం లెక్కేసి చూపిస్తే ఇదీ నిజమే కదా అని అనిపించక మానదు.
ముఖ్యంగా వీర్రాజు చెప్పేది ఏమిటంటే… అధికారపక్షం, విపక్షాలకు వెళ్లకుండా మధ్యేమార్గంగా కనిపిస్తున్న ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో తాము సొంతం చేసుకుంటామని… మెగాస్టార్ చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ఓట్లు బీజేపీకే అని లెక్కకట్టడం మొదలు పెట్టేశాడు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో బిజెపికి 18 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని వీర్రాజు గుర్తుచేశారు. 1998లో వాజ్ పయి నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో బిజెపి కూడా 18 శాతం ఓట్లతో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశాడు. అంటే ఎంత కాదనుకున్నా ఏపీలో అధికార విపక్షాలకు వెళ్లకుండా మధ్యే మార్గంగా కనిపిస్తున్న పార్టీలకు ఓటు వేసే వారు 18 శాతం అని ఆయన లెక్క.
Also Read : సెటైర్ : దెబ్బకు హరీష్ రావు పాలు అమ్ముతున్నాడు… కేటీఆర్ ఆ మజాకా?
ఇంకా అప్పటితో పోల్చుకుంటే విపక్షాలు ఇప్పుడు టిడిపి ఉన్నంత సాధారణంగా అయితే లేవు. అప్పుడు అధికార విపక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నప్పటికీ బిజెపి బాగానే నెట్టుకొచ్చింది. ఇప్పుడు కనీసం అదే స్థాయిలో ప్రభావం ఎందుకు చూపించదు అన్నది ఆయన ప్రశ్న. అంతేకాకుండా గత ఎన్నికల్లో బరిలోకి దిగిన జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించి మొత్తం కలుపుకుంటే పాతిక శాతం ఓట్లు తమ చేతిలోనే ఉన్నాయి అని తేల్చేశారు.
ఇక ఈ లెక్కలు చూసి రియాలిటీ లోకి వచ్చిన అధికార పక్షం, ప్రతిపక్షం నేతలకు చెమటలు పట్టడం మొదలయ్యాయి. వీర్రాజు దూకుడుతో ఆ 25 సంఖ్య కాస్తా 40-50 అయితే మొదటికే మోసం వస్తుంది. రాజకీయాల్లో ఏదీ ఒక్క రాత్రిలో జరిగిపోదు. కానీ పెను మార్పులు సంభవించేందుకు మాత్రం ఒక పూట జరిగే పరిణామాలు చాలు. ఇక ఏకంగా అధికారపక్షం పైకి బాణం ఎక్కుపెట్టి 2024లో పాలకులు అవుతారో లేదా ప్రతిపక్షం వెన్ను విరిచి అధికార పక్షానికి మొగుళ్లు అవుతారో కమలనాథులు చేతుల్లోనే ఉంది.
Also Read : తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఎప్పటినుండో?