Chandrababu: చంద్రబాబుకు కావాల్సింది ఇదే

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారు అన్న టాక్ నడుస్తోంది. అది జరిగితేనే ఏపీలో తనకు అనుకూలంగా పరిస్థితి మారుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.

Written By: Dharma, Updated On : November 24, 2023 4:21 pm

Chandrababu

Follow us on

Chandrababu: తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ప్రచారం పతాక స్థాయిలో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతుండగా.. బిఆర్ఎస్ పట్టు వదలకుండా వ్యవహరిస్తోంది. బిజెపి సైతం ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన అనుకూల వాతావరణం కనిపిస్తోంది.అయితే ఏపీ పార్టీలో ఒక్క జనసేన యాక్టివ్ గా ఉంది. మిగతా రాజకీయ పక్షాలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. అయితే చాప కింద నీరులా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు టిడిపిని పోటీ నుంచి తప్పించి సైలెంట్ గా ఉన్నారు. కానీ ఆయన తెర వెనుక కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారన్న ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే టిడిపి శ్రేణుల వ్యవహార శైలి ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారు అన్న టాక్ నడుస్తోంది. అది జరిగితేనే ఏపీలో తనకు అనుకూలంగా పరిస్థితి మారుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. టిడిపి శ్రేణులతో పాటు కమ్మ సామాజిక వర్గం నేతలు బాహటంగానే కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నారు. టిడిపి కండువాలతో కనిపిస్తున్నారు. తటస్థంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్న టిడిపి శ్రేణులపై ఎటువంటి చర్యలకు చంద్రబాబు ఉపక్రమించడం లేదు. అటు తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవిని సైతం భర్తీ చేయడం లేదు. ఇలా అన్ని రకాలుగా చేస్తున్న పనులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని టాక్ అయితే ఒకటి ఉంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన కమ్మ సామాజిక వర్గం ప్రజాప్రతినిధులు గెలవాలి. తన శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే భారతీయ జనతా పార్టీలో ఒక రకమైన చేంజ్ కనిపిస్తుంది. చంద్రబాబు రూట్ లోకి రావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు.. ఏపీలో వైసీపీ పట్టణానికి నాంది కావాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకుగాను తన శక్తి యుక్తులను అన్నింటినీ ప్రయోగిస్తున్నారు అన్న ప్రచారం అయితే జరుగుతోంది.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును పవన్ ఖరారు చేశారు. వ్యూహంలో భాగంగా భారతీయ జనతా పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. టిడిపి జనసేన కూటమితో… కమ్మ, కాపు సామాజిక వర్గాలు ఒక్కటయ్యాయి. ఆ రెండు సామాజిక వర్గాల మధ్య సమన్వయం కూడా ప్రారంభమైంది. తెలంగాణలో ఓటమి ఎదురైతే.. బిజెపి తనకు తానుగా టిడిపి, జనసేన కూటమి వైపు వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు బే షరతుగా బిజెపి ఈ కూటమిలోకి రావాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణలో దెబ్బ పడితే.. ఆ ప్రభావం ఏపీలో ఉండేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు అన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.