Congress: హుజూరాబాద్ లో కాంగ్రెస్ ప్లాన్ ఇదీ!.. ‘కొండా సురేఖ’కు షాక్

Congress Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్లాన్ రెడి చేసింది. గెలుపు వ్యూహాన్ని సిద్ధం చేసింది. తాజాగా హుజూరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. హుజూరాబాద్ లో మండలానికి ఒక చీఫ్ కో ఆర్డినేటర్ ను గ్రామానికి ఒక ఇన్ చార్జిని వేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ […]

Written By: NARESH, Updated On : October 9, 2021 6:24 pm
Follow us on

Congress Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్లాన్ రెడి చేసింది. గెలుపు వ్యూహాన్ని సిద్ధం చేసింది. తాజాగా హుజూరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. హుజూరాబాద్ లో మండలానికి ఒక చీఫ్ కో ఆర్డినేటర్ ను గ్రామానికి ఒక ఇన్ చార్జిని వేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యూహాలను వివరిస్తూ అధికార టీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ఏడున్నర సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం లో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఈ క్రమంలోనే గ్యాస్,పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిన పార్టీ బీజేపీ అని విమర్శించారు. ఒక పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే.. మరో పార్టీ దేశంలో ఉన్న సామాన్యుల బతుకును చిదిమేస్తోందని ఆరోపించారు..

హుజూరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తారనే నమ్మకం ఉందని మహేష్ కుమార్ చెప్పుకొచ్చాడు. గతంలో మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లు కూడా అసెంబ్లీ లో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు బీసీ జనగణనపై చేసిన తీర్మానం కూడా అలాంటి దేనన్నారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్, మోడీ లు బీసీ ల మీద కపటప్రేమ చూపిస్తున్నారని మహేష్ విమర్శించారు. ఓబీసీ జనగణనపై సోమవారం ఇందిరాభవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించి కేంద్రానికి రిప్రజంటేషన్ పంపిస్తామని తెలిపారు.

రేవంత్ రెడ్డితోపాటు మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ పోరుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే 20 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ను తాజాగా విడుదల చేసింది. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ తెరవెనుక ఉండి నడిపించనుండగా.. రేవంత్, మల్లు భట్టి లీడ్ చేయనున్నారు.

కాంగ్రెస్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్లలో శ్రీనివాస్ కిషన్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, మధు యాష్కీ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీ. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అజారుద్దీన్, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, అనసూయ సీతక్క, కవ్వంపల్లి సత్యనారాయణ, రాజేందర్ రెడ్డిలు ఉన్నారు.

అయితే హుజూరాబాద్ అభ్యర్థిగా ఫోకస్ అయ్యి ఆ టికెట్ ఆమెకేనని అనుకున్న కొండా సురేఖ పేరు ఈ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో లేకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. హుజూరాబాద్ పక్కనే ఉండే పరకాలకు చెందిన కొండాను కావాలనే రేవంత్ రెడ్డి పక్కనపెట్టాడా? అన్న చర్చ సాగుతోంది.