Third Front: థర్డ్ ఫ్రంట్: ఈసారి కేసీఆర్ మిస్సింగ్..

Third Front: దేశంలో మూడో కూటమి ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తుండగా ఫెడరల్ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే నేతలు కుమారస్వామి, శరత్ పవార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, వినరాయ్ విజయన్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ లాంటి వారితో భేటీ అయినట్లు సమాచారం. అయితే బీజేపీ కోసం విపక్షాల్లో అనైక్యత […]

Written By: Srinivas, Updated On : September 8, 2021 4:27 pm
Follow us on

Third Front: దేశంలో మూడో కూటమి ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తుండగా ఫెడరల్ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే నేతలు కుమారస్వామి, శరత్ పవార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, వినరాయ్ విజయన్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ లాంటి వారితో భేటీ అయినట్లు సమాచారం. అయితే బీజేపీ కోసం విపక్షాల్లో అనైక్యత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో మూడో కూటమి ఏర్పాటు విషయం మరోసారి వార్తల్లో సంచలనం సృష్టిస్తోంది.

ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నేత ఓం ప్రకాశ్ చౌతాలా కూడా థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి మూలాయాం సింగ్ యాదవ్, బిహార్ సీఎం నితీష్ కుమార్, అకాలీదళ్ వంటి పార్టీలు హాజరుకానున్నాయని తెలిసింది. దీంతో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు వ్యతిరేకంగా మూడో కూటమి పెట్టాలన్న లక్ష్యంతో ఉన్నారని చెబుతున్నారు. కేసీఆర్ కు మాత్రం ఆహ్వానం లేనట్లు తెలుస్తోంది.

మరోపక్క ప్రశాంత్ కిషోర్ బీజేపీయేతర ప్రభుత్వం కోసం కాంగ్రెస్ తో జతకడుతుండగా ఎవరికి వారే మూడో కూటమి ప్రయత్నాలు చేస్తుండడంతో పార్టీల్లో అనైక్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకే ప్లస్ అవుతుందని తెలుస్తోంది. కాంగ్రెస్ తో కలిసేందుకు చాలా పార్టీలు ముందుకు రావడం లేదు. దీంతో మూడో కూటమి ప్రయత్నాలు ముందుకు సాగేలా కనిపించడం లేదని సమాచారం. ఏది ఏమైనా బీజేపీ ప్రతిష్ట ముందు థర్డ్ ఫ్రంట్ విజయవంతం అయ్యే విధంగా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పీకే శరత్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్ తదితర నేతలతో ఇదివరకే సమావేశమై మూడో కూటమి ప్రాధాన్యత గురంచి వివరించారు. కాంగ్రెస్ తో కలిసి రావాలని కోరారు. కానీ వారిలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం కుదరడం లేదని తెలుస్తోంది. ఆ పార్టీలో ఉండే అంతర్గత కుమ్ములాటలతోనే అధికారం కోల్పోయిందని తెలిసింది. దీంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుుతన్నాయి.