Chandrayaan 3: చంద్రుడి రహస్యాల పై పరిశోధనల కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్_3 విజయవంతమైంది. దీనికోసం కృషి చేసిన శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఇందులో దేశీయ పరిశ్రమల వాటా తక్కువేమీ కాదు. ఎల్ అండ్ టీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, బీ హెచ్ ఈ ఎల్, ఎంటార్ టెక్నాలజీస్, మిశ్ర ధాతు నిగమ్..ఇలా ఎన్నో కంపెనీలు ఇస్రో ప్రాజెక్టుల్లో వెన్ను దన్నుగా నిలుస్తున్నాయి.అటు ప్రభుత్వ, ఇటు ప్రవేట్ సంస్థలు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాయి.
ఎల్ అండ్ టీ
చంద్రయాన్ మిషన్ లాంచ్ వెహికల్ లో మార్క్_3( ఎల్ వీ ఎం_3), ఎం4 ప్రారంభంలో
ఎల్ అండ్ టీ కీలక భాగస్వామి గా ఉంది. క్రిటికల్ బూస్టర్ సెగ్మెంట్స్ ను తయారు చేసింది. పొవాయ్ లోని ఎల్ అండ్ టీ ప్లాంట్ వద్దే ప్రూఫ్ ప్రెజర్ ను పరీక్షించారు. భారతీయ అంతరిక్ష పరిశోధనలకు వెళ్తున్న వ్యోమ నౌక ల వ్యవస్థల ఇంటిగ్రేషన్ లోనూ ఎల్ అండ్ టీ పాత్ర ఉన్నది.
మిశ్ర ధాతు నిగమ్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్.. కోబాల్ట్ బేస్ అల్లాయ్స్, నికోల్ బేస్ అల్లాయ్స్, టైటానియం అల్లాయ్స్ వంటి సామగ్రి అభివృద్ధి, సరఫరాలో పాలు పంచుకున్నది. లాంచ్ వెహికల్ మార్క్_3, ఎం4 లోని వివిధ విడిభాగాల కోసం ప్రత్యేక స్టీల్ అందించింది. వ్యోమ నౌక నింగి లోకి దూసుకెళ్లాడానికి ఎల్వీఎం _3, ఎం_4 లే అవసరం.ఇస్రో గగన్ యాన్ ప్రాజెక్టులోనూ, భవిష్యత్తు లోనూ మిశ్ర ధాతు నిగమ్ భాగస్వామి గా ఉండనుంది. ఇవే గాక పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ రాకెట్ ప్రోగ్రామ్స్, స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ లో కీలక పాత్ర పోషించింది.
అనంత్ టెక్నాలజీస్
ఇండియన్ స్పేస్ ప్రోగ్రాం కోసం 88 పైగా శాటిలైట్లు, 68 పైగా లాంచ్ వెహికల్స్ కు అనంత్ టెక్నాలజీస్ సహకారం అందించింది. చంద్రయాన్_1,2, మంగళ్ యాన్ తోపాటు చంద్రయాన్_3 మిషన్ లో కూడా కీలకంగా ఉంది. లోకి మానవులను తీసుకెళ్ళేందుకు చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్టులోనూ ఈ కంపెనీ భాగస్వామిగా ఉంది.
సెంటమ్ ఎలక్ట్రానిక్స్
భారతీయ అంతరిక్ష మిషన్ల కోసం ఈ కంపెనీ ఇప్పటిదాకా రకరకాల కు చెందిన 300 నుంచి 500 విడిభాగాలు తయారు చేసింది. వీటిని వివిధ అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రో ఉపయోగిస్తోంది. చంద్రయాన్ మిషన్లలోనూ ఈ పరికరాలను ఇస్రో విరివిగా ఉపయోగించింది.
వాల్ చంద్ నగర్ ఇండస్ట్రీస్
ఇప్పటిదాకా ఇస్రో ప్రయోగించిన అన్ని మిషన్లలోనూ ఈ కంపెనీ భాగస్వామిగా ఉంది. 1993లో పిఎస్ఎల్వీ డీ_1 ప్రాజెక్టు నుంచి ఇది ఇస్రాతో ప్రయాణం సాగిస్తున్నది.
గోద్రెజ్ ఏరోస్పేస్
చంద్రయాన్_3 మిషన్ కు క్రిటికల్ కోర్ కాంపోనెంట్స్ ను ఈ సంస్థ అందించింది. రాకెట్ ఇంజన్లను, త్రస్టర్ ల అభివృద్ధి కోసం కృషి చేస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: These industries play a vital role in the success of chandrayaan_3
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com