
పార్టీ రాజకీయాల్లో తన కొడుకు లోకేష్‌ను క్రియాశీలకం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే ఆయన జూమ్ మీటింగ్‌లకే పరిమితమై లోకేష్‌ను క్షేత్రస్థాయిలోకి పంపిస్తున్నారు. ఇప్పటివరకు పార్టీని నడిపించే సెకండ్ పర్సన్ ఎవరూ లేకపోవడతో ప్రత్యామ్నాయంగా తన కొడుకునే ఆ స్థాయిలో తీర్చిదిద్దాలని తండ్రిగా అనుకున్నారు. అయితే.. చినబాబుకు క్షేత్రస్థాయిలో లీడర్లు సహకరిస్తారనే నమ్మకం క్యాడర్‌లో కనిపించడం లేదట.
Video: విశాఖ మెట్రో ప్రారంభం..
జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్‌కు తాజాగా సొంత పార్టీ నేతలే ఝలక్ ఇచ్చారు. నిన్న పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వస్తే.. పలువురు నేతలు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి పీతల సుజాత ఎక్కడా కనిపించలేదు. ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆమె అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సేవలు అందించినా.. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆమె ఆగ్రహంతో ఉన్నారట. అందుకే పర్యటనకు దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.
ఆమెతోపాటే మరికొందరు నేతలు కూడా అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఉండి మాజీ ఎమ్మెల్యే, 2019 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్ కలవపూడి శివ కూడా కనిపించలేదు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్సీ పాందువ్వ శ్రీను, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇలా చాలామంది నేతలు లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నేతలు కూడా స్పందించాల్సి ఉంది.
Also Read: ఎన్నికలకు జగన్ నో.. ఎస్‌ఈసీ, ప్రభుత్వం కోల్డ్ వార్
ఈ క్రమంలో కొత్తగా పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుంటున్న లోకేష్ వీరందరినీ ఏకతాటిపైకి ఎలా తేగలరు..? లేదంటే చంద్రబాబు మరోసారి ఈ అసంతృప్తులను ఫోన్లు బుజ్జగించాల్సిందేనా..? ఆదిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మరి ఎలక్షన్ల వరకు పార్టీని లోకేష్ బాబు ఎలా నడిపించగలడు..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు టీడీపీ క్యాడర్‌ను వేధిస్తున్నాయట.
Comments are closed.