https://oktelugu.com/

Taste Atlas List: బెస్ట్‌ బీన్స్‌ డిష్‌.. టాప్‌ 50లో భారతీయ వంటకానికి స్థానం!

ప్రపంచ వంటకాల్లో భారతీ వంటకాలకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. భారతీయులు ఎక్కడున్నా.. మన వంటకాలనే ఆస్వాదిస్తారు. ఇక మన వంటకాల్లో వాడే ఇంగ్రియట్స్‌ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే.

Written By: Raj Shekar, Updated On : November 15, 2024 4:56 pm
Taste Atlas List

Taste Atlas List

Follow us on

Taste Atlas List: భారతీయ వంటకాలు చాలా భిన్నంగా ఉంటాయి. పాశ్యాత్య దేశాల్లా కాకుండా.. మండ వంటకాలకు ప్రపంచ మంతటా గుర్తింపు ఉంటుంది. మన టిఫిన్స్, భోజనాలు, బిర్యానీలు, నాన్‌వెజ్‌ వెరైటీలు విదేశీయులను సైతం ఆకట్టుకుంటాయి. ఇక మనం తినే ఆహారాల్లో వాడు అన్ని ఇంగ్రిడియంట్స్‌ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. మన మసాలాలతో వంటకాలకు కొత్త రచి వస్తుంది. అవి కూడా మితంగా వాడితే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతుకే ప్రపంచ అత్యుత్తమ వంటకాల్లో మన వంటకాలకూ ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా బెస్ట్‌ బీన్స్‌ డిషెస్‌లలో టాప్‌ 50 జాబితాలో మన బీన్స్‌ వంటకం కూడా ఎంపికైంది. ప్రముఖ ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ విడుదల చేసిన 50 అత్యుత్తమ బీన్స్‌ వంటకాల జాబితలో భారతీయ వంటకం కూడా నిలిచింది. 2024, నవంబర్‌లో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ల మన బీన్స్‌ వంటకం 14వ స్థానంలో నిలిచింది.

రాజ్‌మా..రాజ్‌మా చావెల్‌..
గతేడాది ఫుడ్‌ గైడ్‌ విడుదల చేసిన బెస్ట్‌ రెసిపీల జాబితాలో రాజ్మా, రాజ్మా చావెల్‌ రెండు స్థానం దక్కించుకున్నాయి. ఈ బెస్ట్‌ బీన్స్‌ వంటకాల్లో తొలి స్థానంలో మెక్సికోకు చెందిన ప్యూరీ బీన్‌ సూప్‌ సోపా తారాస్కా నిలిచింది. తర్వాత హైతీకి చెందిన దిరి అక్ప్వ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో బ్రెజిల్‌కు చెందిన ఫిజావో ట్రోపీ నిలిచింది.

రెండు ఆరతీయ చట్నీలు కూడా..
ఇక గతంలో టేస్ట్‌ అట్లాస్‌ విడుదల చేసిన 50 బెస్ట్‌ రెసిపీల జాబితాలో రెండు భారతీయ చట్నీలకు స్థానం దక్కింది. ఇంట్లోని మసాలాలతో తయారు చేసే టేస్టీ చట్నీలుగా అభివర్ణించింది. ఇక రాజ్‌మా కర్రీ వివిధ సుంగంధ ద్రవ్యాలతో చేసిన చిక్కటి గ్రేవీలా ఉంటుంది. ఉత్తర భారత దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన శాఖాహార వంటకాల్లో ఒకటి.